తెలంగాణ

స్థాయి మరచి మాట్లాడిన గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: రాజ్యాంగ పరిరక్షకునిగా ఉండాల్సిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తన స్థాయిని మరచి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును, రాష్ట్ర మంత్రి టి. హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తారని టి.కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, పార్టీకి అనుబంధ విభాగమైన సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్‌రెడ్డి ఆదివారం వేర్వేరుగా స్పందించారు. భట్టి విక్రమార్క మాజీ ఎంపీ వీహెచ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట పెట్టిన ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్ళిన గవర్నర్ నరసింహన్ ఆ పేరును ఎందుకు తొలగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
38 వేల 500 కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టులో అప్పట్లోనే రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పుడు కేవలం కాళేశ్వరంగా పేరు మార్చి రూ.80 వేల 500 కోట్లకు పెంచారని అన్నారు. రూ.50 వేల కోట్ల వ్యత్యాసం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాళేశ్వరం చంద్రశేఖర్ రావుగా, మంత్రి హరీష్‌రావును కాళేశ్వర రావుగా అభివర్ణించిన గవర్నర్ ఇక రాజ్‌భవన్‌నూ టీఆర్‌ఎస్ భవన్‌గా అంటారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తామని భట్టి తెలిపారు.
కనుకుల ఆక్షేపణ
గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యల పట్ల మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్‌రెడ్డి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.
గవర్నర్ తన స్థాయిని మరచి, బాధ్యతలను విస్మరించి ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా మాట్లాడారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం బాగానే ఉంది కానీ అక్కడ ఏవైనా లోపాలు, మంచి-చెడ్డలు ఉంటే వాటి గురించి మాట్లాడాలే కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, రాష్ట్ర మంత్రి టి. హరీష్‌రావును పొగడ్తలతో ముంచెత్తాల్సిన అవసరం ఏముందని కనుకుల ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా పతనం అవుతున్నాయో, పౌర హక్కులు ఎలా కాలరాస్తున్నారో గవర్నర్ ఆలోచించకుండా ఏ కార్యక్రమం జరిగినా ముఖ్యమంత్రి కుటుంబీకులను పొగడడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్ నిష్పక్షపాతంగా ఉండాలని ఆయన సూచించారు.