తెలంగాణ

అప్పుల్లో రాష్ట్రం.. ఘనత కేసీఆర్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 21: సీఎం కేసీఆర్‌ను కాళేశ్వర చంద్రశేఖర్ రావుగా ప్రశసించడం సరికాదని, కాలకూట విషపు చంద్రశేఖర్ రావు కుటుంబమని సంబోధిస్తే సరిపోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో 44 నెలల టీఆర్‌ఎస్ పాలనలో బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమేనని, పేదల కోసం హామీలిచ్చి ఖర్చు చేయాల్సిన నిధులు పెద్దలకే ఉపయోగపడ్డాయని ఆరోపించారు. పేదరిక నిర్మూలనకు, విద్య, వైద్యం, వౌలిక వసతులకు నిధులను ఖర్చు చేయకుండా లాభాపేక్షతో ప్రాజెక్టుల నిర్మాణానికి మళ్ళించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన కొద్ది పాటి నిధులను కేటాయించకుండా, వాటిని అసంపూర్తిగా వదిలేసి కొత్త ప్రాజెక్టులను చేపట్టి, రూ.68 వేల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని రూ.2.30 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్ళారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేస్తామన్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న 1200 మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఏమీ చేయలేకపోయారని అన్నారు. తెలంగాణ క్యాబినెట్ ఒకటి, రెండు సామాజిక వర్గాల కూర్పుతో గుత్త్ధాపత్యం స్పష్టమవుతోందని వివరించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన జలయజ్ఞం చేపట్టి ధనయజ్ఞంగా మార్చారని, అప్పటి స్కీంలన్నీ స్కాములుగా మారాయని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేయడంలో పోటీ పడ్డాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగుల లక్ష ఉద్యోగాలు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ పైరవీ భవన్‌గా మారిందని, సెక్రటేరియట్‌కు వెళ్లకుండా పాలన జరిపిన సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారని, ప్రగతి భవన్ నిర్మాణం చేపట్టి, నాలుగు ఆసుపత్రుల నిర్మాణం మరిచారని తెలిపారు. పల్లెపల్లెకు టీడీపీతో ప్రజల సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. హంగు, ఆర్భాటాలతో ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ కుటుంబం కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్సని, అక్రమ కేసులు పెడుతూ భయపెడుతున్నారని, దానికి నిదర్శనమే మందకృష్ణను జైలుకు పంపడమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పాలనను పొగడ్తలతో ముంచెత్తుతున్న గవర్నర్‌కు జీహెచ్‌ఎంసీలో వాహనాల మరమ్మతు కుంభకోణం, విద్యార్థులకు అందిస్తున్న సన్నబియ్యం కుంభకోణాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ నేత మోత్కుపల్లి పొరపాటుగా మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీ.సుభాష్ యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామకృష్ణ, జిల్లా కార్యదర్శి చంద్రయ్య, ఉపాధ్యక్షుడు జీ.ఉమాశేఖర్, నాయకులు దివాకర్, ఎన్.లక్ష్మణ్ రావు, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ఇన్‌చార్జి రంగరాజు, భుజంగం, దేవేందర్, రాజేశ్, మల్లయ్య, పద్మాకర్, సిరాజ్, కృష్ణ, వరప్రసాద్ రెడ్డి, గొడుగు పాండు, ఎల్లారెడ్డి, ప్రభుసింగ్ పాల్గొన్నారు.