తెలంగాణ

సరైన సమాచారంతోనే సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: రైతులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తే దానివల్ల సత్ఫలితాలు వస్తాయని రాష్టవ్య్రవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కిసాన్ కాల్ సెంటర్ ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజేంద్రనగర్‌లోని కిసాన్ సెల్ అవరణలో ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి సంబంధించి ఏఈఓలు, ఏఓలు తదితర అధికారులు బాగా పనిచేస్తున్నారని, అదే సమయంలో కిసాన్ సెల్ నుండి కూడా సమాచారాన్ని రైతులకు అందివ్వాల్సిన అవసరం ఉందన్నారు. 2018 వానాకాలం పంట నుండే రైతులకు ఎకరానికి నాలుగువేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భారత ప్రభుత్వం 2004 జనవరి 21న కిసాన్ సెల్ ప్రారంభించింది. వ్యవసాయ విస్తరణకు సంబంధించి ఈ సెల్ రైతులకు సమాచారం అందిస్తోంది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..రాజేంద్రనగర్‌లోని కిసాన్ సెల్ ఆవరణలో ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ మంత్రి పోచారం