తెలంగాణ

రాబోతున్నాయ్...ఆధునిక గ్రంథాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్రంలోని గ్రంథాలయాలకు మహర్దశ పట్టనున్నది. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాలతో పాటు కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో ఆధునిక గ్రంథాలయాలను ఏర్పాటు చేసి అన్ని రకాల పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీ్ధర్ ఆదివారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గ్రంథాలయాలను పాఠకులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రి కే.తారక రామారావు ప్రోత్సాహంతో పనులు వేగవంతం చేసినట్లు ఆయన చెప్పారు.
గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. వందేళ్ళు పూర్తయిన షాలిబండ, సూర్యాపేట, శ్రీకృష్ణ దేవరాయ, ఆంధ్ర భాషా నిలయం వంటి గ్రంథాలయాలను మరింత మెరుగుపరిచేందుకు సహాయ, సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలూ అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఒకవేళ అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు ఆయా గ్రంథాలయాల్లో అందుబాటులో లేకపోతే, తనకు ఫలానా పుస్తకం కావాలని చెబితే తెప్పించి ఇచ్చే సౌకర్యాన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో కల్పించనున్నట్లు తెలిపారు. సదరు అభ్యర్థుల కోరిక మేరకు తెప్పించే పుస్తకాలను వారి వినియోగం తర్వాత అక్కడే భద్ర పరుస్తామన్నారు.
ప్రజాప్రతినిధుల వాటా..
కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోని కేంద్రాల్లో గ్రంథాలయాల స్థాపనకు పనులు వేగవంతం చేశామని ఆయన తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో సుమారు కోటి రూపాయల చొప్పున వ్యయం చేసి భవన నిర్మాణంతో పాటు పుస్తకాలు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరిస్తుందని, మిగతా 50 శాతం స్థానిక ప్రజాప్రతినిధులు వారికి ఉండే నిధుల్లో నుంచి కేటాయిస్తారని తెలిపారు.
యువత, రైతుల కోసం..
యువత, రైతులకూ ఉపయోగపడే అనేకానేక పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. అతి ప్రాచీనమైన, ముఖ్యమైన పుస్తకాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ ఇదివరకే ప్రారంభమైందని, దీనిని మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టామని చైర్మన్ డాక్టర్ ఆయాచితం వివరించారు. లక్ష పుస్తకాలను డిజిటలైజేషన్ చేయాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ ప్రక్రియలో ఇప్పటికే 31 వేల పుస్తకాలు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే ఖురాన్ (ఉర్దూ) ఇంకా పలు ప్రాచీన చరిత్ర గల గ్రంథాల డిజిటలైజేషన్ చేశామని ఆయన తెలిపారు. డిజిటలైజేషన్‌కు రాష్ట్ర ఐటీ విభాగం సహకారం తీసుకున్నామని చెప్పారు. మంత్రి కేటీఆర్ పూర్తిగా సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. వీటిని ప్రత్యేక వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో పెడతామని, దీంతో పాఠకులు గ్రంథాలయాలకు వెళ్ళకుండా, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో తమకు కావాల్సిన పుస్తకాలను చదువుకోవడానికి వీలుంటుందన్నారు.
అంధుల కోసమూ ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్నీ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. గ్రంథాలు, వివిధ పుస్తకాల్లో ఇంగ్లీషు పదాలు అక్కడక్కడా దొర్లుతున్నాయని అన్నారు. ఈ విషయమై అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీతో చర్చించామని, మలి దశ చర్చించాల్సి ఉందన్నారు. గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకీ ప్రభుత్వాన్ని సంప్రదించి భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్ ఆయాచితం శ్రీ్ధర్ తెలిపారు.