తెలంగాణ

రాజ్‌భవనలో కాదు.. ప్రజాభవన్‌లో ఉంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ‘రాజ్‌భవన్‌లో కాదు, ప్రజా భవన్‌లోనే ఉంటా..’ అని బిజెపి జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ లోక్‌సభకే పోటీ చేస్తానని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. గవర్నర్‌గా ఎప్పుడు వెళతారని ప్రశ్నించగా, గవర్నర్‌గా వెళ్ళే ఆలోచన ఏదీ లేదని, రాజ్ భవన్ కంటే ప్రజాభవన్‌లో ఉండాలనే కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. తెలంగాణలో తమ పార్టీ బ్రహ్మండంగా బలపడుతున్నదని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారం దిశగా పయనిస్తున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ఆయన చెప్పారు. పార్టీ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి పార్టీ ఫిరాయించనున్నట్లు వస్తున్న వార్తాకథనాల గురించి, వదంతుల గురించి స్పందించేందుకు దత్తాత్రేయ నిరాకరించారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనవసరంగా ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారని అన్నారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రంలోని తమ పార్టీ అత్యధికంగా సాయం చేసిందన్న విషయాన్ని మరచిపోరాదని ఆయన సూచించారు. మిషన్ భగీరథకు రూ.3,900 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. మిషన్ కాకతీయకు రూ.677 కోట్లు ఇచ్చిందన్నారు. ‘నాబార్డు’ నుంచి మూడు రకాలుగా నిధులు అందాయని ఆయన తెలిపారు. ‘నాబార్డు’ నుంచి 99 రకాల పథకాలు ఉండగా, అత్యధికంగా రాష్ట్రానికి 11 రకాల పథకాలను ప్రధాని మోదీ అందించారని ఆయన తెలిపారు. బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు రెండే పథకాలు దక్కాయని ఆయన ఉదహరించారు. గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పొగడడం గురించి ప్రశ్నించగా, దత్తాత్రేయ స్పందించలేదు. అయితే కేంద్రం విడుదల చేసిన నిధుల గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమని అన్నారు.