తెలంగాణ

త్వరితగతిన పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, జనవరి 21: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, కనె్నపల్లి, అన్నారం బ్యారేజీల పనుల పురోగతిని పరిశీలించేందుకు ఆదివారం ఇక్కడకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కనె్నపల్లి పంప్‌హౌస్, గ్రావిటీ కెనాల్ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అన్నారం బ్యారేజి నుంచి కనే్నపల్లి పంప్‌హౌస్ వరకు ఉన్న పదమూడు కిలోమీటర్ల దూరం ఉన్న కెనాల్ వర్కు పనులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కాలినడకన తిరిగి పరిశీలించారు. ఆయనతోపాటు నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, సుధాకర్‌రెడ్డితోపాటు మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంత్రి వెంట పర్యటించారు. కనె్నపల్లి పంప్‌హౌస్ నుండి అటవీ మార్గం గుండా పదమూడు కిలోమీటర్ల మేర చేపట్టిన కెనాల్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి హరీష్‌రావు గుత్తేదారులను అదేశించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 75శాతం పనులు పూర్తయినట్టు గుత్తేదారులు మంత్రికి వివరించారు. కాలువ పరిధి అటవీ ప్రాంతంలో పదమూడు కిలోమీటర్లు ఉండగా ఆ ప్రాంతంలోని పది కిలోమీటర్ల మేర చెట్లు కొట్టివేసారని, మరో మూడు కిలోమీటర్ల మేర అడవిలోని చెట్లను తొలగించే పనులను వేగవంతం చేస్తున్నామని గుత్తేదారులు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి హరీష్‌రావుతో కలిసి శనివారం కాళేశ్వరం పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సందర్భంలో గ్రావిటీ కెనాల్ పనులను సందర్శించిన విషయం విదితమే. మరుసటి రోజు ఆదివారం మంత్రి హరీశ్‌రావు అకస్మాత్తుగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను సందర్శించటం అధికారుల్లో హడావుడి కలిగించింది.
మంత్రి పర్యటన సందర్భంగా కాటారం డీఎస్పీ ప్రసాద్‌రావు అధ్వర్యంలో భారీభద్రత ఏర్పాటుచేశారు. మంత్రి హరీశ్‌రావు రెండు రోజులపాటు మహాదేవపూర్ మండలంలో పర్యటించనున్నట్టు అధికారులు తెలిపారు.

చిత్రం..కెనాల్ పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు