తెలంగాణ

గ్రామ పాలనలో జవాబుదారి ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 21: ‘దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు’ అని చెప్పుకోవడానికి బాగానే ఉన్నా గ్రామీణ పాలన వ్యవస్థలో జవాబుదారీ తనం పూర్తిగా లోపించింది. గ్రామీణ పాలనపై ప్రశ్నల మీద ప్రశ్నలే తప్ప సరియైన సమాధానం ఎక్కడా కూడా లభించదు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు బాధ్యతగా వ్యవహరిస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన నైతిక బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతసేపు నిధుల లేమి గురించే మాట్లాడే ప్రజాప్రతినిధులు ఉన్న వ్యవస్థను చక్కబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు. గ్రామ ప్రజల వౌలిక అవసరాలను తీర్చడానికి ఆయా శాఖలకు అనుబంధంగా పనిచేస్తున్న సిబ్బంది పల్లె జనాభాకు అనుగుణంగా కనిష్టంగా 30 నుంచి గరిష్టంగా 50 మంది వరకు పని చేస్తుంటారు. కానీ ఆ పనిచేసే సిబ్బంది బాధ్యతగా వ్యవహరిస్తున్నారా? ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అన్నింటికీ నైతిక బాధ్యత వహించేది సర్పంచేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక సాధారణ మధ్య తరగతి గ్రామ పంచాయతీలో వివిధ శాఖలకు సంబంధించి ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నారో ఓసారి పరిశీలిద్దాం. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు 8 నుంచి 12 మంది వరకు ఉంటారు. అయతే వీరు ఎలాంటి రాజకీయ పార్టీ గుర్తుపై ఎన్నిక కాకుండా పాలకవర్గాలను విస్తరించుకున్నారు. సర్పంచుకు కూడా ప్రభుత్వ పరం గా గౌరవ వేతనం వస్తూనే ఉంది. ఉప సర్పం చ్, వార్డు సభ్యులకు ఎలాంటి గౌరవ వేతనం లేకపోయినా స్వచ్ఛందంగా గ్రామాభివృద్ధిలో భాగస్వాము లు కావాల్సి ఉంటుంది. ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికైనా అధికార బాధ్యతలు లేకపోగా ప్రత్యేక నిధులు కూడా లేక ఉత్సవ విగ్రహాలుగానే ఉంటు న్నా తనవంతుగా గ్రామాభివృద్ధికి పాటుపడాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులను పక్కన పెడితే ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా పని చేస్తున్న వారి వివరాల్లోకి వెళితే పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారి, రెవెన్యూ సహాయకులు పంచాయతీ జనాభాకు అనుగుణంగా ఒకరు లేదా ఇద్దరు, ముగ్గురు, నలుగురు వరకు నియామకమై ఉన్నారు. వీరే ఒకప్పుడు గ్రామ పోలీసులుకాగా ఇప్పుడు పదవి స్థాయిని పెంచి వీఆర్‌ఏలుగా నియమిస్తున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక చికిత్సలు అందించడానికి ఏఎన్‌ఎం ఒకరు, గ్రామంలో ఉండే ప్రభుత్వ పాఠశాల తరగతుల స్థాయిని బట్టి ఉపాధ్యాయులు, సాగునీటి వ్యవసాయాన్ని చక్కబెట్టడానికి షకిదర్ (నీరడి), విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు లైన్‌మెన్, అతనికి సహాయకుడు, వీసీఓ (సాక్షరభారతి) ఒకరు లేదా ఇద్దరు, పశువైద్యాన్ని అందించడానికి వెటర్నరీ అసిస్టెంట్, శాంతి భద్రతల పర్యవేక్షణకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఒకరు, ఈజీఎస్ పనుల పర్యవేక్షణకు ఫీల్డ్ అసిస్టెంట్, వ్యవసాయ సమస్యల పర్యవేక్షణకు ఏఈఓలు, పారిశుద్ధ్యాన్ని మెరుగపర్చేందుకు గ్రామ పంచాయతీ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఒకరు లేదా ఇద్దరు పని చేస్తుంటారు. ఇందిర క్రాంతి పథం ద్వారా గ్రామైక్య సంఘానికి ఇద్దరు పర్యవేక్షకులు, గర్భిణీలు, బాలింతలకు సహాయం అందించడానికి ఒకరిద్దరు ఆశావర్కర్లు, గ్రామ జనాభా, చిన్నపిల్లల సంఖ్యకు తగినట్టుగా అంగన్‌వాడీ టీచర్లు ఒకరు లేదా ఇద్దరు, మంచినీటి సరఫరాను పర్యవేక్షించడానికి వాటర్ మెన్, జనాభా కు తగ్గట్లుగా రేషన్ డీలర్లు ఒకరు లేదా ఇద్దరు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను నివారించడానికి విద్యావాలంటీర్లు, మధ్యాహ్న భోజనం వండేందుకు ఇద్దరు, అంగన్‌వాడీ కేంద్రాలకు తగినట్టుగా ఆయాలు దాదాపుగా అన్ని గ్రామాల్లో పని చేస్తుంటారు. కొన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది అన్ని గ్రామ పంచాయతీలు, గ్రామాల్లో ఉండకపోయినా ఎక్కువ శాతం సిబ్బంది మాత్రం గ్రామాల ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇన్ని శాఖల సిబ్బంది గ్రామంలో అందుబాటులో ఉన్నా వీరిని సమన్వయం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగంకానీ, గ్రామ పంచాయతీ పాలక వర్గం కాని సరియైన శ్రద్ధ చూపడం లేదు.
వీళ్లలో జవాబుదారీతనం తీసుకురావాలంటే ప్రతి రోజు వీరంతా గ్రామ సచివాలయానికి వెళ్లి విధిగా హాజరు సంతకాలు పెట్టి, ఆ రోజు నిర్వర్తించే బాధ్యతలు ఏమిటనేవి లిఖించాల న్న నిబంధనలు ఎక్కడా కూడా ఆచరించడం లేదు. ఆయా శాఖలకు అనుబంధంగా పని చేస్తున్న వారి వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయా ఉంటే ఆ నంబర్లు గ్రామ ప్రజలందరికి తెలుసా, ఏ సమయంలో వీరు అందుబాటులో ఉంటారు, వీళ్లతో పని ఉంటే ఎక్కడ సంప్రదించాలి, గ్రామ పంచాయతీల్లో సిటిజన్ చార్టర్లు ఉన్నాయా అంటే ఎక్కడ కూడా కనిపించవని చెప్పవచ్చు. సిటిజన్ చార్టర్ నిబంధనల ప్రకారం పనులు చేసిపెడుతున్నారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. పంచాయతీల నిధుల కొరత కారణంగా పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించుకోలేని దయనీయ స్థితిలో అనేక గ్రామాలు ఉన్నాయి. పారిశుద్ధ్యం ఎక్కడికక్కడే పడకేసి రోగ కారకాలైన ఈగ లు, దోమలు వృద్ధి చెంది ప్రజలు మంచాలు పట్టేందుకు కారణమవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రధానంగా ఆయా శాఖల్లో పని చేస్తున్న సిబ్బందిని ఏకతాటిపైకి తీసుకువచ్చి క్రమశిక్షణతో పని చేసే విధంగా నియమావళిని రూపొందిస్తే గ్రామీణ పాలన వ్యవస్థ మెరుగుపడుతుందని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.
చిత్రం..సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామ భౌగోళిక స్వరూపం