తెలంగాణ

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 21: బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ నూతన కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వైదిక బ్రాహ్మణ సంఘం నిర్వహించిన విళంబి నామసంవత్సర పంచాంగ ఆవిష్కరణ సభకు ఆయ న హాజరై పంచాంగాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 40వేల కోట్లు ఏటా సంక్షేమ రంగానికి వెచ్చిస్తున్నారన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి 100 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి బ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. ధూపదీప నైవేద్య పథకం కింద కొత్తగా మరిన్ని ఆలయాలకు నిధుల మొ త్తాన్ని పెంచి అందిస్తుందన్నారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా బ్రహ్మణ కుటుంబాల విద్య, ఉపాధికి చేయూతనందిస్తుందన్నారు. బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. నల్లగొండలో సైతం బ్రాహ్మణ సంక్షేమ భవన్ నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నామన్నారు. స్థానికంగా టీటీడీ వేద పాఠశాల తరలిపోకుండా చర్యలు తీసుకున్నామని దీని అభివృద్ధికి ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అర్చక, పురోహితుల సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తుందన్నారు. విళంబి నామసంవత్సరం తెలంగాణ ప్రజలకు సుఖసంతోషాలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ విజయవంతంగా నూతన ఏడాదిలో కొనసాగాలన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా రాష్ట్రంలో కోతల్లేని 24గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి, గృహ, పరిశ్రమల రంగానికి అందిస్తున్నామన్నారు. పంటల సాగు కు పెట్టుబడి సహాయంగా ఎకరాకు పంటకు నాలుగువేల పథకం తేనుందన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు న్న పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రగతి మరింత ముం దుకుసాగనుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర డైరక్టర్ చకిలం అనిల్‌కుమార్, రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు గంగుల భానుమూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసుదేవ శర్మ, శ్రీనివాస్‌శర్మ, రామలింగయ్యశరమ్మ, మార్కెట్ చైర్మన్ కొప్పోలు అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విళంబి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ సభలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి