తెలంగాణ

ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తేనే ప్రభుత్వ పాఠశాలలకు మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 21: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తేనే పాఠశాలల మనుగడ సాగిస్తాయని అందువల్ల ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుండి ఈ విద్యావిధానాన్ని అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.రాములు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన సంఘం జిల్లాకార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు అదనపు తరగతి గదులు, అదనపు ఉపాధ్యాయుల కేటాయింపు కోసం వచ్చేనెల నుండి తమ సంఘం ఆధ్వర్యంలో గ్రామీ ణ విద్యాసదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించనున్నట్టు తెలిపారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
11వ వేతనకమిటీ ఏర్పాటు చేసి ఈ ఏడాది జనవరి నుండి అమలు చేయాలని, ఉమ్మడి సర్వీస్ నిబంధనల వివాదాలను పరిష్కరించి పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు.
నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానా న్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యకు 10శాతం, జీడీపీలో 6శాతం నిధులు కేటాయించాలని కోరారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు అందించాలని, పండిత్ పీఈటీలను స్కూల్ అసిస్టెంట్‌లుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.్ధనమూర్తి, ఎన్.సోమయ్య, ఉపాధ్యక్షులు లక్పతినాయక్, నాగమణి, కోశాధికారి సయ్యద్, నాయకులు సైదు లు, అనిల్‌కుమార్, మంగ, వీరారెడ్డి, సత్యనారాయణ, జీవీ రమణారావు, గోపిరెడ్డి, పద్మావతి, వెంకటయ్య పాల్గొన్నారు.