తెలంగాణ

జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.2398 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణలోని నేషనల్ హైవేస్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధి పథకం (ఎన్‌హెచ్‌డీపీ) కింద 2398 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర రహదారులు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్ అండ్ బి కార్యక్రమాలపై సోమవారం ఆయన ఇక్కడ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్రం గ్రాంటు కింద జాతీయ రహదారుల కోసం నిధులు ఇస్తోందన్నారు. ఆరంగఢ్ నుండి శంషాబాద్ వరకు ఉన్న రోడ్డును ఆరులేన్ల రోడ్డుగా మార్చేందుకు 290 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని తెలిపారు. ‘తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి’ పథకం కింద రాష్ట్రంలోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు 1290 కోట్ల రూపాయలు కేంద్రం నుండి లభించాయని, ఈ నిధులను యుద్ధప్రాతిపదికన ఖర్చు చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నిధులతో గోదావరి నదిపై మూడు వంతెనలను నిర్మించేందుకు కేంద్రం ఆమోదించిందని మంత్రి తెలిపారు. 26 జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా 21 జిల్లాల్లో భూసేకరణ పూర్తయింది. కొమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ (పట్టణ), సిద్ధిపేట, జనగాం, వికారాబాద్, మేడ్చల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, భువనగిరి యాదాద్రి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, భూపాలపల్లి, సిరిసిల్ల, నిర్మల్, మహబూబాబాద్, కొత్తగూడెంలలో స్థల సేకరణ పూర్తయింది. మంచిర్యాల, సూర్యాపేటల్లో భూసేకరణ జరిగినప్పటికీ, భవన నిర్మాణాలకు స్థలాలు అనువుగా లేవని తేల్చారు. ఖమ్మం, మెదక్, వరంగల్ (గ్రామీణ) జిల్లాల్లో భూసేకరణ జరగాల్సి ఉందని తెలిపారు.