తెలంగాణ

సర్పంచ్‌ల ఎన్నికల విధానం మార్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: సర్పంచ్ ఎన్నికల విధానాన్ని మార్చరాదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో పలువురు నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడానికి మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫార్సులను అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నదని తెలిపారు. ఇందులో ప్రధానంగా సర్పంచ్ ఎన్నిక విధానాన్ని మార్చి వార్డు సభ్యుల ద్వారా పరోక్ష ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకునే విధానంగా మార్చాలన్న ఆలోచన చేస్తున్నదని ఆయన చెప్పారు. లోగడ తమ సంఘం అనేక పోరాటాలు చేసిన తర్వాతే ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి వచ్చిందన్నారు. అంత కంటే ముందు పరోక్ష పద్ధతిలో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరిపినప్పుడు అనేక గొడవలు జరిగి గ్రామాలన్నీ అల్లకల్లోలం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా వార్డు మెంబర్ల కిడ్నాపులు, కొనుగోలు పద్ధతులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం అని, అవినీతి, అభద్రతా భావం పెరుగుతుందని, బిసి, ఎస్‌సి, ఎస్‌టిల నాయకత్వం దెబ్బతింటుందన్నారు. భూస్వామలు, ధనవంతులే ఎన్నిక అవుతారని, గ్రామ స్వరాజ్యం దెబ్బతింటుందని, గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని, అవిశ్వాస తీర్మానాలు పెరిగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో లేని వారినీ కో-ఆప్షన్ సభ్యునిగా నియమించాలనుకోవడం సరైంది కాదన్నారు. కాబట్టి దీనిపై ప్రజాభిప్రాయం సేకరించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలని కృష్ణయ్య కోరారు.
ఫీజుల బకాయిలు చెల్లించాలి
ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, పిజి, డిగ్రీ, ఇంటర్ కోర్సులు చదివే విద్యార్థులు పూర్తి ఫీజులు చెల్లించాలని, గత సంవత్సరం ఫీజుల బకాయిలు రూ.1600 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పగిళ్ళ సతీష్ అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య ప్రసంగిస్తూ అద్దెకు ఉన్న బిసి కళాశాల వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి ఫీజులు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది బిసి విద్యార్థులు ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు నిలిపి వేస్తున్నారని ఆయన తెలిపారు. బిసిలకు 500 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.