తెలంగాణ

కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జనవరి 22: నియోజకవర్గంలోని ముంపురైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్‌కు రైతులతో కలిసి వచ్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని లోపలికి వెళ్లకుండా ప్రధాన గేట్‌వద్దనే పోలీసులు అడ్డుకొని గేట్ వేయడంతో పోలీసుల తీరును నిరసిస్తూ రైతులతో కలిసి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు తనపట్ల వ్యవహరించిన తీరును ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేగా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారంటే సామాన్య ప్రజల దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని ఆయన విలేఖరులతో అన్నారు. తనపట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ శ్రీ్ధర్ ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే వద్దకు వచ్చి మాట్లాడి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేను శాంతింపచేశారు. ఎమ్మెల్యేతోపాటు రైతులను ప్రజావాణి హాల్‌లోకి తీసుకొని వెళ్లారు.

చిత్రం..నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ముందు బైఠాయించిన కల్వకుర్తి ఎమ్మెల్యే, వంశీచంద్‌రెడ్డితో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీ్ధర్.