తెలంగాణ

గురుకులాల్లో ఇంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్యాల, జనవరి 22: రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం వచ్చే సంవత్సరం నుండి ఇంటర్‌మీడియట్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆయన సోమవారం మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గురుకులంలోని డార్మెటరీ హాల్, మూత్రశాలలు, హస్టల్ గదులను తిరిగి పరిశీలించారు. అలాగే నిర్మాణ దశలో ఉన్న పనులను తనిఖీ చేసి పనులు నిర్లక్ష్యంగా నత్తనడకన నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను పిలిచి మందలించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీఎం కేసిఆర్ విద్యారంగానికి పెద్ద పీట వేసి 473 గురుకులాలను, 53 డిగ్రీ కళాశాలను మంజూరు చేసి విద్యారంగాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్తున్నారన్నారు. వచ్చే సంవత్సరం 29 జనరల్ గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. గురుకుల పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతు, నిర్మాణాల కోసం రూ. 10 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో రూ. 3.5 కోట్ల నిధులు మంజూరు చేయగా, పనులు జరుగుతున్నాయని, మరో రూ. 4.5 కోట్లు నిధులు మంజూరు చేస్తామని, ఈ నిధులను గురుకులంలో అప్‌గ్రేడ్ డార్మెట్ హల్, ఉపాధ్యాయుల గదులను వెచ్చించనున్నట్టు, ఈ పనులు వచ్చే జూన్ లోగా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొడిగే శోభ మాట్లాడుతూ గురుకుల పాఠశాలకు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసి మరింత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, జేసీ రాజేశం, రాష్ట్ర గురుకుల సొసైటీ కార్యదర్శి సత్యానారాయణరెడ్డి, డిఇఒ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఒ మల్హోత్ర, ఎంపీపీ తైదల శ్రీలత, ఎంపీటీసీ కర్ర లత, సర్పంచ్ ఎనుగందుల రజనీ, టీఆర్‌ఎస్ నేతలు బొట్ల ప్రసాద్, కొల్ల్లూరి గంగాధర్‌తో పాటు అధికార పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.

చిత్రం.. మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకులంలో సోమవారం ప్రతిభ చాటిన
విద్యార్థులను సన్మానిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి