తెలంగాణ

బాసరకు వసంతశోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జనవరి 22: బాసర క్షేత్రం సోమవారం వసంతశోభను సంతరించుకుంది. మాఘశుద్ధ పంచమిని వసంతపంచమిగా వేడుకగా నిర్వహిస్తారు. జ్ఞానానికి ఆదిదేవత సరస్వతీదేవి జ్ఞానిస్వరూపిణిగా పిలుస్తారు. వసంతపంచమి సందర్భంగా బాసర అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర దేవాదాయశాఖ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డిలు మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలోని అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రులతో ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి ఆశీర్వదించారు. ఆలయ ఈవో ఎ.సోమయ్య, ఛైర్మెన్ శరత్‌పాఠక్, పాలకవర్గ సభ్యులు మంత్రులను పట్టువస్త్రాలతో సత్కరించి అమ్మవారి ఫొటోను, ప్రసాదాలను అందజేశారు. ఆలయంలోని ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన మనవరాలికి అక్షరాభ్యాస పూజను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు, చిన్నారులతో అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడాయి. 3150 మంది చిన్నారులకు ఆలయ అర్చకులు ఘనంగా అక్షరాభ్యాస పూజలను నిర్వహించారు. దీంతోపాటు ఎంపీ జితేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు.
బాసర క్షేత్రాన్ని అభివృద్ధి పరుస్తాం :
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
అమ్మవారి దర్శనానంతరం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ బాసర క్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను వేస్తోందని అన్నారు. వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారని పేర్కొన్నారు. త్వరలోనే బాసర క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.

చిత్రం.. వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా బాసరలోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకుంటున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి అల్లోల, ఎంపీ జితేందర్‌రెడ్డి