తెలంగాణ

మానవ సహిత అంతరిక్ష నౌకకు రూ.20వేల కోట్ల ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: భారతదేశం అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టించే శక్తిసామర్థ్యాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పూర్వ చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ మానవ సహిత రోదసీ నౌకను అంతరిక్షంలో పంపాలంటే కనీనసం రూ.20 వేల కోట్ల ఖర్చవుతుందన్నారు. పదేళ్ల క్రితం అంతరిక్ష శాస్తవ్రేత్తలు ఈ అంశంపై చాలాసార్లు సమీక్షించారని, అప్పట్లో దీనికి వ్యయం రూ. 8 నుంచి 10వేల కోట్లవుతుందని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. భారత్ శాస్తవ్రేత్తలు మంచి సమర్థత కలిగి ఉన్నారని, శాస్త్ర సాంకేతిక రంగాలపై మంచి పట్టు ఉందన్నారు. కాని నిధుల లేమి వల్ల అప్పట్లో ఈ ప్రాజెక్టు ముందుకు పోలేకపోయి ఉండవచ్చన్నారు. మానవ సహిత రోదసీ నౌకను అంతరిక్షంలో పంపితే భారత్ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందని, దీనిపై సర్వత్రా ఆసక్తి కూడా పెరుగుతుందన్నారు. అంతరిక్షంలో రోదసీ నౌకను పంపాలంటే విశేషమైన సమిష్టి భాగస్వామ్యంతో కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సత్తా భారత్ శాస్తవ్రేత్తలకు ఉందన్నారు. పర్యావరణ నియంత్రణ చాంబర్, కొత్త నమూనాలో నౌకను తయారు చేయాల్సి ఉంటుందన్నారు. రోదసీ నౌకలో శాస్తవ్రేత్తను పంపడమంటే, దీనికి సంబంధించి అనేక సురక్షిత చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదేమీ బ్రహ్మాండమైన విషయమేమి కాదని, భారత్ సంస్థలకు సామర్థ్యం ఉందన్నారు. వచ్చే రోజుల్లో ఈ ప్రతిపాదన సాకారమవుతుందన్నారు. కాని వనరులు లభ్యతపైనే ఆధారపడి ఉంటుందన్నారు.