తెలంగాణ

అనర్హతకు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అర్హులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల తరహాలోనే తెలంగాణలోనూ పార్లమెంటు సెక్రటరీలుగా కొనసాగిన ఆరు మంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంటు సెక్రటరీలుగా కొనసాగిన ఆరు మంది ఎమ్మెల్యేలే కాకుండా లాభదాయకమైన అదనపు పదవులలో నియమితులైన మరో ముగ్గురు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై కూడా ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆయన మంగళవారం రాష్టప్రతికి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ‘ఆప్’కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు గతంలో పార్లమెంటు కార్యదర్శులుగా కొనసాగడం, వారిపై చట్ట ప్రకారంగా అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేస్తూ ఎన్నికల కమిషనర్ రాష్టప్రతికి నివేదించడం, రాష్టప్రతి ఆ ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయడం జరిగిందని ఆయన తెలిపారు. తెలంగాణలోనూ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉల్లంఘన జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆరు మంది ఎమ్మెల్యేలను గతంలో పార్లమెంటు కార్యదర్శులుగా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే డి. వినయ్ భాస్కర్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే జి.కిశోర్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి. సతీష్‌కుమార్, అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పార్లమెంటు కార్యదర్శులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2014 డిసెంబర్ 29న, జివో ఎంఎస్ నెం.173ని జారీ చేయడం జరిగిందని ఆయన వివరించారు. అయితే రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యను రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేయగా 2015 మే 1న రాష్ట్ర హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. 2014 డిసెంబర్ నుంచి మొదలుకుని కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకూ వారు పార్లమెంటు సెక్రటరీలుగా కొనసాగారని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన నియామకాలను చేపట్టరాదని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆయన తెలిపారు. అయినా ప్రభుత్వం కొత్త విధానంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ కొత్త పదవుల్లో నియమించిందని ఆయన పేర్కొన్నారు. జివో ఆర్‌టి నెం.613 ద్వారా మానకొండూరు ఎమ్మెల్యే బాలకిషన్‌ను తెలంగాణ సాంస్కృతిక సారథిగా, జివో ఎంఎస్ నెం.32 (తేదీ 27-4-16) ద్వారా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను ఆర్టీసీ చైర్మన్‌గా, జివో ఎంఎస్ నెం.32 (తేదీ 26.4.16) ద్వారా బాల్కొండ ఎమ్మెల్యే వి. ప్రశాంత్‌రెడ్డిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిందని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ పదవులకు రాష్ట్ర మంత్రివర్గ హోదా ఇవ్వడంతో వారు ఆ హోదాకు సంబంధించిన అన్ని సౌకర్యాలను, లాభాలను పొందుతున్నందున ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ కింద ఆ పదవుల్లో కొనసాగేందుకు వీలు లేదని వివరించారు.