తెలంగాణ

తెలంగాణ ఎమ్మెల్యేలపైనా వేటువేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: రాజ్యాంగ విరుద్ధంగా లాభదాయక పదవులు అనుభవిస్తున్న 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై వేటు పడిందని, అలాగే తెలంగాణలోనూ రాజ్యాంగ విరుద్ధంగా ఆరుగురు ఎమ్మెల్యేలను సిఎం కెసిఆర్ పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారని వారిపై కూడా వేటు వేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలను బర్త్ఫ్ చెయాలని అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడే హామీల వర్షం కురిపిస్తున్నారని కాని పనులు మాత్రం సాగడం లేదని అన్నారు. ఎంబిసిల కోసం వెయ్యి కోట్లు కేటాయించిన టిఆర్‌ఎస్ సర్కార్ అందులో కనీసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని అన్నారు. ప్రతి అంశంలో ఆర్భాట ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టిఆర్‌ఎస్ సర్కార్ వాస్తవానికి ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని అన్నారు. సిఎం కేసిఆర్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉద్ధృతం చేస్తామని అన్నారు. బీసీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న సర్కార్‌కు బుద్ధి చెప్పేలా భారీ ఎత్తున బిసి సంగ్రామ సభను నిర్వహించనున్నట్టు లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన కెసిఆర్ ఉన్న ఉప ముఖ్యమంత్రిని కూడా తొలగించారని, సామాజికాభివృద్ధికి పోరాడుతున్న మందకృష్ణను అరెస్టు చేసి అణచివేతకు పాల్పడటం దారుణమని అన్నారు. కేసీఆర్ సర్కార్ మొదటి నుండి మాయమాటలు చెప్పి ప్రజలను వంచిస్తోందని, దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని త్వరలోనే దళిత అదాలత్‌లు నిర్వహిస్తామని తెలిపారు. మహిళామోర్చ బీసీ మోర్చ, యువమోర్చ ఆధ్వర్యంలో జహీరాబాద్ నుండి ప్రజాసమస్యలపై ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తామని, జహీరాబాద్‌లో భారీ బీసీ సంగ్రామాన్ని నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో మద్యంపై మహిళా మోర్చ ద్వారా యుద్ధం ప్రకటిస్తామని, ఆదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. 100 కళాబృందాలతో ఫిబ్రవరి 19 నుండి 23 వరకూ యాత్ర నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామని అన్నారు. ప్రజాసమస్యలపై అన్ని జిల్లాల్లో ఫిబ్రవరి నుండి రాజీ లేని పోరాటాలను కొనసాగిస్తామని, ప్రజల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రజాచైతన్య యాత్రను చేపట్టనున్నట్టు తెలిపారు. వరంగల్, సత్తుపల్లికి చెందిన తెరాస నాయకులు పెద్ద ఎత్తున బిజెపిలో చేరుతున్నారని ఆయన తెలిపారు.