తెలంగాణ

కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ.. వచ్చేది తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: కేంద్రప్రభుత్వం ఎక్కువ నిధులను కేంద్ర పన్నుల రూపేణా రాబట్టుకునే రాష్ట్రాలకు నిధులు విదిలించడం, వెనకబడిన రాష్ట్రాలకు నిరంతరంగా ఎక్కువ నిధులను ఇస్తోంది. దక్షిణాది రాష్ట్రాలతో సహా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలపై వివక్ష ప్రదర్శించడం తగదని ఆర్థిక సంఘాల సమావేశాలు, జిఎస్‌టి, ఆదాయం పన్ను శాఖ, నీతి అయోగ్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకువస్తున్నా ప్రయోజనం కనపడడం లేదు. ఈ విషయమై త్వరలో సమర్థత ఉన్న రాష్ట్రాలు ఒక బృందంగా ఏర్పడి కేంద్రంపై ఒత్తిడి తేనున్నాయి. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి పలుసార్లు తీసుకెళ్లినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశంలో సమర్థత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్ర స్థానంలో ఉంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే మంచి ఆదాయాన్ని కేంద్ర ఖజానాకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 2016-17 సంవత్సరంలో ఆదాయం పన్ను ద్వారా రూ.32,186 కోట్లు, సర్వీసు ట్యాక్స్ ద్వారా రూ.7671 కోట్లు, కస్టమ్స్ డ్యూటీ రూపంలో రూ.3328 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ ద్వారా రూ. 6828 కోట్లు కలిపి మొత్తం రూ.50013 కోట్లు వసూలయ్యాయి. ఇంత భారీ ఎత్తున పన్నుల ఆదాయం కేంద్ర ఖజానాకు జమయ్యాయి. కాని తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ స్పాన్సర్డ్ పథకాల కింద వచ్చే నిధులు ఇందులో సగం మాత్రమే 2016-17 సంవత్సరంలో కేంద్రం అమలు చేసే పథకాల నిమిత్తం రూ.24,561 కోట్ల నిధులు వచ్చాయి. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే నిధుల్లో సగం కూడా రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం ఇవ్వడం లేదు. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఆర్థిక నిర్వహణలో మంచి సమర్థత ఉన్న రాష్ట్రాలుగా పేరుతెచ్చుకున్నాయి. బీహార్ రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ కంటే ఎక్కువ. కాని వెనకబడిన రాష్ట్రం పేరిట బీహార్‌కు ఆ రాష్ట్ర బడ్జెట్‌లో 70 శాతం నిధులను అందిస్తోంది. బీహార్ బడ్జెట్ రూ.17 లక్షల కోట్లు. 14వ ఆర్థిక సంఘం వెనకబడిన రాష్ట్రాలకు ఇతోధికంగా ఎక్కువ నిధులు ఇవ్వాలని నిర్ణయించి అమలు చేస్తోంది. కేంద్ర పన్నులు సరిగా వసూలు కాకపోయినా, నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వసూళ్లు చేయకపోయినా, ఆ రాష్ట్రాలకు వెనకబడిన రాష్ట్రాల పేరిట ఎక్కువ నిధులను కేంద్రం ఇస్తోంది. ఈ అసమానతలను తొలగించాలని తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పలుసార్లు కేంద్రాన్ని కోరింది. 15వ ఆర్థిక సంఘం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని పనిచేసే రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా ఉండాలని రాష్ట్రానికి చెందిన మంత్రులు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా కేంద్రం దృష్టికి తీసుకు వస్తున్నారు.
కేంద్రం 30 నుంచి 42 శాతం వరకు నిధుల కేటాయింపును పెంచినా, ఆ మేరకు తెలంగాణకు పెరిగిన ఆదాయం రూ.1000 కోట్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ నిర్వహణలో మంచి పేరుతెచ్చుకున్నా, రాష్ట్రంలో 30 వరకు వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. వీటికి కేంద్రం రూ.900 కోట్ల మేరకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద నిధులు ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఈ అంశం విభజన చట్టంలో కూడా ఉంది. ఆశించిన మేరకు కేంద్రం నుంచి నిధులు రావడం లేదు.