తెలంగాణ

కేసీఆర్ పాలనలో వెనకబడిన విద్యారంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పాలనలో విద్యా రంగం పూర్తిగా వెనకబడిందని టి.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం గాంధీ భవన్‌లో టిఎస్‌ఎఫ్ డైరీని ఉత్తమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన కేజీ-టు-పీజీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను మూసి వేస్తూ విద్యను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన ఈ మూడున్నరేళ్ళలో ఒక్క డిఎస్సీ వేయని అసమర్థ ప్రభుత్వమని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయను దుయ్యబట్టారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే వరకూ కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. పండిట్ ఉద్యోగాలను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఆపర్టీ అధికారంలోకి రాగానే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని, పండిట్ ఉద్యోగాలను అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పని చేయడం లేదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉత్తమ్ విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగికి కార్పోరేట్ వైద్యం అందిస్తామన్నారు.