తెలంగాణ

మంద కృష్ణ, కోదండరామ్‌లకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో పర్యటించేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌కు ఎందుకు ఇవ్వలేదని ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంతరావు ప్రశ్నించారు. లోగడ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపై ఘాటైన విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందని అనడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. కత్తి మహేష్ చేసిన ఆరోపణలపై పవన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారిని పరామర్శిస్తామంటే అనుమతులు ఉండవని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దీక్ష చేస్తామంటే మంద కృష్ణకు అనుమతి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అజ్ఞాతవాసి సినిమాకు 5 షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతించడంతో, సిఎం కేసీఆర్ స్మార్ట్ సిఎం అయ్యారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.