తెలంగాణ

మీ జేబు నుంచి ఇవ్వలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించిందని, అంతే తప్ప రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తన జేబు నుంచి గానీ తన తండ్రి జేబు నుంచి గానీ చెల్లించలేదని టి.టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వెంకట్‌రెడ్డి వైద్య ఖర్చులను తామే భరించామని మంత్రి కెటిఆర్ చెప్పడాన్ని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తోసిపుచ్చుతూ, ప్రజాప్రతినిధుల వైద్యానికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు చెల్లించాలని చట్టంలో ఉందన్నారు. తెరాస అధికారంలోకి రావడం ‘అకాల వర్షం’ లాంటిదేనని, 2019 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్ స్పష్టం చేశారు. ఎవరైనా ప్రజాప్రతినిధి మరణిస్తే జరిగే ఉప ఎన్నికల్లో ఆ ప్రజాప్రతినిధి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయం లోగడ ప్రారంభమైందని, అయితే ఈ సంప్రదాయానికి తెరాస తిలోదకాలిచ్చిందని ఆయన విమర్శించారు. లోగడ వైఎస్ విజయలక్ష్మి పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన విషయా న్ని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.