రాష్ట్రీయం

జూలై 1నుండి ఇంజనీరింగ్ క్లాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో జూలై 1 నుండి తరగతులు ప్రారంభిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. జూన్ 21లోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌనె్సలింగ్ పూర్తి చేస్తామని, ఇంకా భారీ ఎత్తున సీట్లు మిగిలితే స్లయిడింగ్ లేదా స్లయిడింగ్‌తో పాటు కౌనె్సలింగ్‌కు ప్రయత్నిస్తామని పాపిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్సెట్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగలేదని, అడ్మిషన్లలోనూ జాప్యం ఉండదని, క్లాసులు కూడా సకాలంలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రభుత్వ కాలేజీల్లోనే పరీక్షలు
ప్రభుత్వ కాలేజీల్లోనే పరీక్షలను నిర్వహిస్తున్నామని, అన్ని సౌకర్యాలను పరిశీలించిన తర్వాతనే పరీక్ష కేంద్రాల ఎంపిక జరిగిందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పాపిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ప్రతి విద్యార్ధికీ మంచినీటి ప్యాకెట్లను కూడా ఇస్తామని తెలిపారు. వెయిటేజీ పాత పద్ధతి మాదిరే కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీలు కొనసాగుతున్నాయని, అది పూర్తి కాగానే ఆయా కాలేజీల్లో ఉన్న అన్ని సౌకర్యాల వివరాలను ఇంటర్‌నెట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నామని, వచ్చే ఏడాది నుండి కాలేజీల గ్రేడింగ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని పాపిరెడ్డి చెప్పారు.