తెలంగాణ

పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: తెలంగాణ రాష్ట్రంలో పాడిపరిశ్రమాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని విజయ డైరీ ప్లాంట్‌ను సందర్శించారు. 2.48 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బాయిలరీ ప్లాంట్‌ను, 1.70 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన లాబోరేటరీని, గోదామును ప్రారంభించారు. తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాడి పరిశ్రమ రంగంలో, పాల ఉత్పత్తిలో మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు వీలుగా విజయ డైరీ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. 56 సంవత్సరాల చరిత్ర కలిగిన విజయడెయిరీకి మార్కెట్లో మంచి పేరుందని, బ్రాండ్ ఉత్పత్తులను విస్తరించి లాభాలు సంపాదించాలని సూచించారు. విజయ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయం కోసం పర్యాటక కేంద్రాలు, దేవాలయాలు, రోడ్లపై, ఇతర ముఖ్య కూడళ్లలో అమ్మకం కేంద్రాలను (ఔట్‌లెట్లను) ఏర్పాటు చేయాలని సూచించారు. దీని వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని గుర్తు చేశారు.
భవిష్యత్తులో పాడిపరిశ్రమ, పశుసంవర్ధకం, మత్స్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పాడిపరిశ్రమపై ఆధారపడ్డ రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. రైతులకు ఇస్తున్న పేమెంట్లు, ఇన్‌సెంటివ్‌లపై కొంత మంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ తరహా ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. విజయ డెయిరీ డెవలప్‌మెంట్ సబ్ కమిటీ సమావేశం త్వరలో నిర్వహించి కీలకనిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ ప్లాంట్ ఎండి కె.నిర్మల తదితర అధికారులు పాల్గొన్నారు.