రాష్ట్రీయం

తొలగిన తెరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ - విద్యారంగం : 2015
=======================
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైంది. కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్యను అందించే కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేయడం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం పూర్తయింది. పాఠశాల విద్యాశాఖను పటిష్టం చేయకుండా ఉచిత విద్య సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఉన్న సౌకర్యాల రీత్యా వాటికి గ్రేడ్‌లను ఇచ్చి ప్రతి పాఠశాలలో అసౌకర్యాలను గుర్తించింది. ఇటీవలి కాలంలో అన్ని స్కూళ్లలో కనీసం టీచర్లు ఉండేలా క్రమబద్ధీకరణ పూర్తి చేసింది. రాష్ట్రంలోని 9 యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియకూ ప్రభుత్వం పూనుకుంది. విసిల నియామకాలకు మార్గదర్శకాలు ఇవ్వడమేగాక, నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
====================
తెలంగాణలో విద్యారంగానికి సంబంధించి ఈ ఏడాది అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవడంలో ప్రభుత్వం సఫలమైంది. రాష్టప్రునర్విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి ఉన్నత విద్యా శాఖలోనూ, సాంకేతిక విద్యాశాఖలోనూ, పాఠశాల విద్యాశాఖలో అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, అధికారులు పునర్విభజన, నియామకాల ఇబ్బందులను ఎదుర్కొంది. అది ఎంత వరకూ పోయిందంటే ఒక్క అధికారి రెండు మూడు యూనివర్శిటీలకు ఇన్‌చార్జిలుగా పనిచేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అదే విధంగా ఇటు పాఠశాల విద్యాశాఖకు, అటు సర్వశిక్షా అభియాన్‌కు అధికారుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఉన్నవారితోనే ఏడాది కాలంగా బండి నడిపించారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన అభయం కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్యను అందించే కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేయడం, ఆ కమిటీ నివేదికను ఇవ్వడం పూర్తయింది. కమిటీ సిఫార్సులను అమలుచేయాలంటే వౌలిక సదుపాయాలను కల్పించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాల విద్యాశాఖను పటిష్టం చేయకుండానే ఉచిత విద్య సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఉన్న సౌకర్యాల రీత్యా వాటికి గ్రేడ్‌లను ఇచ్చి ప్రతి పాఠశాలలో అసౌకర్యాలను గుర్తించింది. ఇటీవలి కాలంలో అన్ని స్కూళ్లలో కనీసం టీచర్లు ఉండేలా క్రమబద్ధీకరణ పూర్తి చేసింది. దాంతో ప్రతి పాఠశాలలో రెగ్యులర్ లేదా పార్టు టైమ్ టీచర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది.
మరో పక్క రాష్ట్రంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది. దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి, సాధారణ రెసిడెన్షియల్ స్కూళ్ల మధ్య సమన్వయం, పరీక్షలు ఏకకాలంలో నిర్వహించడం, పాఠశాలల మధ్య టీచర్లను సైతం బదిలీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొంతమేరకు రెసిడెన్షియల్ స్కూళ్ల మధ్య సమన్వయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నా, వాటిని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంది.
స్కూళ్లలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) విధానాన్ని అమలుచేయడం ద్వారా దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందుంది. తొలి ఏడాది సిసిఇ అమలులో ఇబ్బందులు వచ్చినా, విద్యార్థుల్లో అయోమయం ఏర్పడినా, టీచర్లు గందరగోళానికి గురైన సమస్యలు నెమ్మదిగా పరిష్కారం అయ్యాయి. కొత్త పద్ధతి లోగుట్టును అర్థం చేసుకున్న టీచర్లు తాజాగా తమ బోధన విధానంలో మార్పులు తెచ్చుకుంటూ కొత్త పరీక్షల విధానానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారు.
ఇక అందరి దృష్టీ డి.ఎస్సీపైనే ఉంది. డి.ఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు ముందు టెట్ నిర్వహించాల్సి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో డి.ఎస్సీ నిర్వహించేందుకు వీలుగా టెట్ నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేసింది. అనుకున్న షెడ్యూలు ప్రకారం అంతా జరిగితే వచ్చే ఏడాది స్కూళ్లు తెరిచే నాటికి అన్ని స్కూళ్లలో శాశ్వత టీచర్లు ఉండేందుకు వీలు కలుగుతుంది. అలాగే లెక్చరర్ల రిక్రూట్‌మెంట్ బాధ్యతను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించారు.
రాష్ట్రంలోని 9 యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియకూ ప్రభుత్వం పూనుకుంది. విసిల నియామకాలకు మార్గదర్ళకాలు ఇవ్వడమేగాక, నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా నియామకానికి ఇంత వరకూ 208 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. జనవరి 8వ తేదీ వరకూ దరఖాస్తు గడువు ఉన్నా, దానిని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉంది. పది మంది ప్రొఫెసర్లు ఐదారు వర్శిటీలకు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించారు. వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి ఇంతవరకూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధనలను ఇటీవలే తెలంగాణ రాష్ట్రం సవరించింది. గతంలో సెర్చి కమిటీలు పరిశీలించి రెండు మూడు పేర్లు సూచిస్తే అందులో ఒక పేరును రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదిస్తూ, గవర్నర్‌కు పంపించేది, ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఆ పేరును ఆమోదించే వారు, కొన్ని సందర్భాల్లో గవర్నర్ తిరస్కరించి మరో మూడు పేర్లతో నామినేషన్లు పంపించమని అడిగిన సందర్భం కూడా ఉండేది. అయితే ఈసారి తెలంగాణలో గవర్నర్ ప్రమేయాన్ని తొలగించిన ప్రభుత్వం ముఖ్యమంత్రికి ప్రత్యక్షంగా కట్టబెట్టింది. గతంలోనూ ముఖ్యమంత్రులు అనధికారికంగా సూచించిన పేర్లనే గవర్నర్లు ఆమోదించినా, నేడు నేరుగా ముఖ్యమంత్రి వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసే అవకాశం దక్కింది, అంతే కాదు, ప్రతి యూనివర్శిటీకి ఛాన్సలర్లను సైతం ప్రభుత్వం నియమించే వీలు కూడా ఉంది.
తెలంగాణలో ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, శాతవాహన యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ, పాలమూరు యూనివర్శిటీ, మహాత్మాగాంధీ యూనివర్శిటీ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్శిటీ లకు కొత్త విసిలను నియమించనున్నారు.
ఇక ప్రభుత్వ పాఠ్యగ్రంథాల ముద్రణాలయం, తెలుగు అకాడమిలను తెలంగాణ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. కొత్త పుస్తకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముద్రణ ప్రారంభించింది. కొద్దికాలం జగదీశ్వర్‌రెడ్డి విద్యాశాఖా మంత్రిగా ఉన్నా, పూర్తి అనుభవం ఉన్న కడియం శ్రీహరిని మొత్తం విద్యాశాఖకు నియమించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇపుడిపుడే విద్యాశాఖకు మార్గదర్శనం చేస్తున్నారు.

-బి.వి.ప్రసాద్