తెలంగాణ

తెలంగాణ టెన్త్‌లో 85.63 శాతం ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ ఏడాది తెలంగాణలో జరిగిన టెన్త్ పరీక్షల్లో 85.63 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ఇక్కడ విడుదల చేశారు. వరంగల్‌ జిల్లా 95.13 శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానంలో నిలిచింది. రాజధాని నగరం హైదరాబాద్‌ 76.23 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,55,265 మంది విద్యార్థులు హాజరుకాగా 4,44,828 మంది ఉత్తీర్ణులయ్యారు. 2015లో 77.56 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత 8 శాతం పెరిగింది. బాలురు 84.70 శాతం మంది పాస్‌ కాగా, బాలికలు 86.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 1.87అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2,379 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 10 పాఠశాలలు సున్నా ఫలితాలు సాధించాయి. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 15 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.