జాతీయ వార్తలు

సునామీ మృతులకు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల విలయం జరిగి పదకొండేళ్లు
తమిళనాట ప్రత్యేక ప్రార్థనలు, ప్రదర్శనలు

చెన్నై, డిసెంబర్ 26: పదకొండేళ్ల క్రితం 2004లో సరిగ్గా ఇదే రోజు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో ఏడు వేల మందికి పైగా పొట్టన పెట్టుకున్న సునామీని గుర్తుచేసుకుంటూ శనివారం రాష్టవ్య్రాప్తంగా మృతులకు ఘన నివాళులర్పించడంతో పాటుగా, వారిని సంస్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు, వౌన ఊరేగింపులు నిర్వహించారు. చెన్నై, కడలూరు, పుదుచ్చేరి, నాగపట్నం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు నిర్వహించారు. సునామీకి గుర్తుగా మత్స్యకారుల సంఘాలు ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు నిర్వహించాయి. చెన్నైలోని మెరీనా బీచ్‌లో మృతుల కుటుంబాల సభ్యులు సముద్రంలోకి పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజుకు గుర్తుగా చెన్నైలో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు. నాగపట్నం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు సునామీ మృతులకు నివాళిగా ఒక నిమిషం వౌనం పాటించారు. రాష్ట్ర ఫిషరీస్ శాఖ మంత్రి కెఎ జయపాల్, జిల్లా కలెక్టర్ ఎస్ పళనిసామి ఆధ్వర్యంలో వౌన ప్రదర్శనలు, కొవ్వొత్తి ప్రదర్శనలు నిర్వహించారు. సుప్రసిద్ధ వేలాంకణ్ణి చర్చిలో ప్రత్యేక ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేసారు. మృతులకు నివాళిగా పట్టణంలో అన్ని షాపులను మూసి వేసారు. నాగూర్‌లోని హజరత్ సయ్యద్ షాహుల్ హమీద్ ఖాదిర్ వలీ దర్గాకు చెందిన స్మశానవాటికలో సామూహిక ఖననం చేసిన మృతులకు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. నాగపట్టణం జిల్లాలోని సునామీ తాకిడికి గురయిన మొత్తం 72 మత్స్యకార గ్రామాల్లో ప్రజలు తమ ఆత్మీయులను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లాలోని మత్స్యకారులు ఈ రోజు చేపల వేటకు వెళ్లలేదు.
కడలూరులో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి నేతృత్వంలో వౌన ప్రదర్శన జరిగింది. గ్రామాల్లో మత్స్యకార సంఘాల ప్రతినిధులు మృతులకు నివాళి అర్పించారు. కారైకల్‌లో సునామీ తాకిడికి తుడిచిపెట్టుకుపోయిన 12 గ్రామాల ప్రజలు వౌన ప్రదర్శనలు నిర్వహించి మృతులకు ఘనంగా నివాళులర్పించారు. చాలా మత్స్యకార గ్రామాల్లో ప్రజలు మృతి చెందిన తమ ఆత్మీయులకు నివాళిగా ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేశారు.
** చెన్నైలో సముద్రం ఒడ్డున సునామీ మృతులకు నివాళులర్పిస్తున్న జాలర్ల కుటుంబీకులు **