తెలంగాణ

న్యాయాధికారుల సెలవులను ఆమోదించే అధికారం జిల్లా జడ్జిలకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో న్యాయాధికారుల సెలవులను ఆమోదించే అధికారాన్ని జిల్లా ప్రిన్సిపల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికే తిరిగి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టును విభజించాలని కోరుతూ న్యాయాధికారులు ఆందోళన చేసిన విదితమే. ఈ నేపథ్యంలో న్యాయాధికారుల సెలవులను ఆమోదించే అధికారం హైకోర్టు స్వీకరించింది. తాజాగా ఈ అధికారాలను మళ్లీ జిల్లా చీఫ్ జడ్జిలకే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై
19న హైకోర్టు విచారణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 14: అగ్రిగోల్డ్ సంస్ధ ఆస్తుల విలువ, మార్కెట్ విలువలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన విచారణ చేపడుతామని హైకోర్టు ప్రకటించింది. అగ్రిగోల్డ్‌పై వచ్చిన అభియోగాలపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారిస్తున్న సంగతి విదితమే.
పోకిరీల వేధింపులు తాళలేక
విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్, సెప్టెంబర్ 14: పోకిరీల వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని గత కొంతకాలంగా అక్బర్, నరేష్ అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. కాగా ఈ విషయాన్ని సదరు బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు యువకులను బెదిరించారు. అయినా యువకులు వేధింపులు ఆపకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వేధింపులకు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు.
రేపు పంచాయితీ కార్మికుల ధర్నా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో గ్రామపంచాయితీ కార్మికులు ఈ నెల 16 న మండల స్థాయిలో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గణపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఐ.శ్రీపతిరావు, గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.