రాష్ట్రీయం

టిటిడి పరిధిలోకి 10 దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 10 దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
చిత్తూరు జిల్లా తొండమానాడు వేంకటేశ్వరస్వామి ఆలయం, సత్రావడ కరి వరదరాజ స్వామి ఆలయం, తరిగొండ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, తిరుచానూరు శ్రీనివాస ఆలయం, కీలపాటియా కోనేటిరాయ స్వామి ఆలయం, చంద్రగిరి కోదండరామస్వామి ఆలయం, కడప జిల్లా జమ్మలమడుగు నారాపుర వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం, గుంటూరు జిల్లా అనంతవరం వేంకటేశ్వరస్వామి ఆలయం, విశాఖపట్నం జిల్లా ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయాలను టిటిడి పరిధిలోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జివో జారీ చేసింది.
ఈ ఆలయాల పరిరక్షణ, సిబ్బంది జీతాలు చెల్లించేందుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వం సూచించింది. తిరుమల తిరుపతి తరహాలో వీరికి ఇకనుంచి వేతనాల పరిరక్షణ ఉంటుందని తెలిపింది.