రాష్ట్రీయం

ఒంటిమిట్టకు తక్షణం రూ.20కోట్ల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయాభివృద్ధికి చర్యలు
చెన్నైకి వైద్య బృందాలు
సత్రాల పునర్నిర్మాణానికి నిధులు
టిటిడి చైర్మన్ చదలవాడ వెల్లడి

తిరుమల, డిసెంబర్ 7: ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నైలో వరద బాధితులను ఆదుకునేందుకు తితిదే ప్రత్యేక వైద్య బృందాలను పంపి సేవలు అందించాలని ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించినట్టు టిటిడి ట్రస్ట్‌బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. సోమవారం స్థానిక అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలను చదలవాడ కృష్ణమూర్తి విలేఖరులకు వివరించారు. చెన్నయ్‌లో నెలకొన్న పరిస్థితులు స్థానికులను పలురకాల అనారోగ్య పరిస్థితుల్లోకి నెట్టిందన్నారు. వారిని ఆదుకోవడానికి తితిదే వైద్య బృందాలను పంపడంతోపాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేయనున్నట్టు తెలిపారు. కడపజిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయం అభివృద్ధికి రూ.20కోట్లు నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఈ ఆలయాన్ని భద్రాచలం తరహాలో అభివృద్ధి చేస్తామని, ఇందుకు ఎన్ని నిధులు ఖర్చయినా వెనుకాడబోమన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. మోకాలి మెట్టు నుంచి జిఎన్‌సి వరకు మూడో మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది వలే ఈసారీ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. నాయడుపేటలోని తుమ్మూరు ఆలయాన్ని తితిదేలోకి విలీనం చేయాలని నిర్ణయించామన్నారు. ఆలయ పరిధిలో వంద ఎకరాల భూములన్నాయని, వాటిని తితిదే స్వాధీనం చేసుకోనుందని చెప్పారు. ఆలయంలో జరిగే కైంకర్యాలను, నిత్యపూజలను తితిదే ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.