రాష్ట్రీయం

ఆంధ్రలో వరద నష్టాల అంచనాకు రెండు కేంద్ర బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను అంతర్‌మంత్రిత్వశాఖల అధికారులతో కూడిన కేంద్ర బృందాలు రెండు పరిశీలించనున్నాయి. వరద ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఈ కమిటీలు అంచనా వేస్తాయి. ఈ కమిటీలు 8వ తేదీన హైదరాబాద్ చేరుకుంటాయి. అదే రోజు వరద ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. హోం మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్ నేతృత్వంలోని కమిటీ 9వ తేదీ నుండి 11 వరకూ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుంది. ఈ కమిటీలో ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వశాఖ రీజనల్ అధికారి ఎ కృష్ణప్రసాద్, వ్యవసాయ మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ మనోజ్ కుమార్ వర్మ, నీతి ఆయోగ్ రీసెర్చి ఆఫీసర్ వెంకట నారాయణ అంగిన ఉంటారు. ఇక రెండో బృందానికి వ్యవసాయ మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఎస్‌ఎం కొల్హాత్కర్ నాయకత్వం వహిస్తారు. ఈ బృందంలో గ్రామీణాభివృద్ధిశాఖ డిప్యూటీ సెక్రటరీ రేఖా చౌహాన్, సిడబ్ల్యుసి ఎస్‌ఇ ఒఆర్‌కె రెడ్డి, ఆర్ధిక మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ హరి మిశ్రా ఉంటారు. రెండు మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించి వచ్చిన తర్వాత ఈ బృందాలు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమవుతాయి. అనంతరం నష్టాలపై అంచనాకు వచ్చి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడును ఈ నెల 11వ తేదీన విజయవాడలో కేంద్ర బృందాలు కలుస్తాయి.