అంతర్జాతీయం

యూనివర్సిటీ మృతులకు పాక్ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్‌సద్దా, జనవరి 21: పాకిస్తాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలో బుధవారం మిలిటెంట్లు 21 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన తర్వాత గురువారం దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించారు. నలుగురు సాయుధ మిలిటెంట్లు ఖైబర్-్ఫక్తూన్‌క్వా రాష్ట్రంలోని చార్‌సద్దాలో ఉన్న బచాఖాన్ యూనివర్సిటీలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఒక ప్రొఫెసర్ సహా 20 మంది మృతి చెందడం తెలిసిందే. దాడికి పాల్పడిన నలుగురు మిలిటెంట్లను భద్రతా దళాలు ఆ తర్వాత కాల్చి చంపాయి. కాగా, గురువారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. మృతుల ఆత్మశాంతికి అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖైబర్-్ఫక్తూన్‌ఖ్వా రాష్ట్ర ప్రభుత్వం గురువారంనుంచి మూడు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. కాగా, పాకిస్తాన్‌నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నవాజ్ షరీఫ్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మొత్తం దేశం సంఘటితంగా ఉన్న విషయాన్ని ఉగ్రవాదులు, వారికి నిధులను సమకూర్చేవారు త్వరలోనే తెలుసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. గాయపడిన విద్యార్థి అయాజ్ గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరుకుంది. ఇదిలా ఉండగా పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి సర్దేరి పోలీసు స్టేషన్‌లో ఉగ్రవాద నిరోధక చట్టం కింద పోలీసులు ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించి పోలీసు ప్రత్యేక బృందాలు పెషావర్, దారా అదమ్‌ఖేల్, ఖైబర్ ఏజన్సీ తదితర ప్రాంతాల్లో దాడులు జరిపి 17 మంది అనుమానితులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నాయి.