హైదరాబాద్

ఊపందుకున్న ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: మహానగర పాలకసంస్థ ఎన్నికల్లో భాగంగా ప్రచారం ముమ్మరమైంది. ఆదివారం సెలవురోజు కావటంతో ప్రజలను నేరుగా కలిసి ఓట్లను అభ్యర్థించేందుకు అధికార, విపక్షాలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పాతబస్తీతో పాటు కోర్ సిటీ, శివార్లలోనూ గల్లీగల్లీలో ప్రచార రథాలు పరుగులు తీశాయి. ఉదయం ఏడుగంటల నుంచే అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. మజ్లిస్ పోటీ చేస్తున్న 60 డివిజన్లలోనూ ఆదివారం నుంచి ప్రచారం ఊపందుకుంది. ఉదయం, సాయంత్రం పాదయాత్రలు, సాయంత్రం బహిరంగ సభలు, ఆ తర్వాత కార్యకర్తలతో చర్చలు నిర్వహించేందుకు వీలుగా ఆ పార్టీ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి కొన్ని డివిజన్లలో అగమ్యగోచరంగా తయారైంది. మజ్లిస్ బలంగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం నేటికీ చప్పగానే సాగుతోంది. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపిలు వారికి సమయమిచ్చి, ప్రచారానికి రాకపోవటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పాతబస్తీతో పాటు నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ప్రచారాన్ని ప్రారంభించనే లేదు. కానీ టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక నామినేషన్ల పర్వానికి ముందే ప్రచారానికి శ్రీకారం చుట్టిన టిఆర్‌ఎస్ జోరుకు విపక్షాలు బేజారవుతున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా టిడిపి, బిజెపి పార్టీల్లో ఇంకా అసంతృప్తి జ్వాలలు రుగులుతున్న తరుణంలో తిరుగుబాటుదారులను బుజ్జగించే పనిలో ఆ పార్టీల నేతలున్నారు. అధికార పార్టీ తరపున ఆదివారం కూడా మంత్రులు కెటిఆర్, తమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డి అర్బన్ డివిజన్లలో మంత్రి మహేందర్‌రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.