రాష్ట్రీయం

ఉగ్రవాదంపైనే గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: సముద్ర జలాల్లో విధ్వంసానికి కుట్ర పన్నుతోన్న ఉగ్రవాద ఆగడాలు అరికట్టేందుకు నౌకాదళం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా శుక్రవారం జాతీయ, అంతర్జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడారు. సముద్ర జలాల సుస్థిరత, భద్రత, రక్షణ బాధ్యత నౌకాదళాలపై ఉందంటూనే, అన్ని దేశాలూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని అన్నారు. పొరుగు దేశాలతో భారత్ స్నేహ సంబంధాలు కోరుకుంటోందన్న విషయాన్ని చైనాలాంటి దేశాలకు తెలియజెప్పడానికే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. చైనా సహా 50 దేశాల ప్రతినిధులు ఫ్లీట్ రివ్యూకి హాజరవడాన్ని బట్టి వారు మనతో మైత్రినే కోరుతున్నారని భావించవచ్చన్నారు.
సముద్ర జలాల పరిరక్షణపై నేడు అంతర్జాతీయ సదస్సు
సముద్ర జలాల పరిరక్షణ విషయంలో దాదాపు అన్ని దేశాలూ ఒకే విధమైన ఆలోచనతో ఉన్నాయన్నారు. భారతదేశం కూడా పొరుగు దేశాల నౌకాదళాలను కలుపుకొని ముందుకెళ్తోందన్నారు. ఇందులో భాగంగా 2008లో ఇండియన్ ఓషనల్ నేషనల్ సింపోజియం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా నేవీ చీఫ్ చైర్మన్‌గా 30మంది సభ్యులతో జాయింట్ వర్కింగ్ కమిటీ ఏర్పాటైందని, కమిటీ కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా శనివారం సముద్ర జలాల పరిరక్షణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి సదస్సు విశాఖలో జరగబోతోందని వివరించారు. సదస్సులో వివిధ దేశాల ముందున్న సవాళ్లను, వాటిని ఎదుర్కొనేందుకు మార్గాలను అనే్వషించనున్నట్టు చెప్పారు. ఉగ్రవాద నిర్మూలన, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరస్పర సహకారం అందించుకోవడంపై సదస్సులో చర్చించనున్నట్టు వివరించారు.
గణనీయంగా ఎదిగాం
15ఏళ్లలో భారత నౌకాదళం మల్టీ డైమన్షనల్ ఫోర్స్‌గా ఎదిగిందని ధావన్ వివరించారు. 2006లో సముద్ర జలాల పరిరక్షణ, తీర భద్రతకు భారత ప్రభుత్వం ప్రాధాన్యత పెంచిందన్నారు. భూమి, ఆకాశం, సముద్రంలో ఎక్కడినుంచైనా పోరాడేందుకు భారత నౌకాదళం సిద్ధంగా ఉందన్నారు. స్వయం సమృద్ధి, స్వదేశీ పరిజ్ఞానం నినాదాన్ని రక్షణ రంగం అంది పుచ్చుకుందన్నారు. 1964లో తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఇండోర్ పెట్రోల్ వెసల్ ఐఎన్‌ఎస్ విజయ భారత్ నౌకాదళంలో చేరిందన్నారు. ఇప్పుడు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, కోల్‌కత్తా క్లాస్ డిస్ట్రాయర్స్, పి28-ఐ, యాంటీ సబ్‌మెరైన్ కార్వెట్ కడ్మత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నవేనని వివరించారు. ఇటీవల ఇస్రో ప్రయోగించిన రుక్మిణి శాటిలైట్ సేవలను భారత నౌకాదళం వినియోగించుకుంటూ నెట్‌వర్క్ నేవీని అభివృద్ధి చేసిందన్నారు. రక్షణరంగంలో 90 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. స్వదేశ భద్రతేకాకుండా పొరుగునున్న శ్రీలంక, మైన్మార్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి అనేక దేశాలకు అండగా భారత నౌకాదళం నిలుస్తోందని ధావన్ చెప్పారు. అన్ని రంగాల్లో శక్తియుక్తులను చాటుతూ భారత నౌకాదళం తన సమర్థత చాటుకుందని వివరించారు.
ఐఎఫ్‌ఆర్‌కు అరిహంత్ దూరం
స్వదేశీ పరిజ్ఞానంతో భారత దేశం రూపొందించిన ఐఎన్‌ఎస్ అరిహంత్ న్యూక్లియర్ సబ్‌మెరైన్‌పై వివిధ దేశాలు చాలా అంచనాలు వేస్తున్నాయి.. అరిహంత్‌ను ఫ్లీట్ రివ్యూలో ప్రదర్శిస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు లేదని ధావన్ సమాధానమిచ్చారు.