తెలంగాణ

ఉద్యానవనాలతో ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 5: రైతుల భవిష్యత్తును మార్చే శక్తి ఉద్యానవన రంగానికే ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్ అండ్ బి శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆ దిశగా రైతులకు అవగాహనక ల్పించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మారుస్తామని శుక్రవారం ఖమ్మంలో జరిగిన అధికారుల సమీక్షలో వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తమ ప్రభుత్వం భారీ రాయితీలతో రైతులకు అండగా ఉండటం ద్వారా వ్యవసాయాన్ని పండుగలా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆయిల్‌పాం పంట అధికంగా ఉన్న ఖమ్మం జిల్లాలో 72 కోట్లతో మరో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామన్నారు. ఎక్కడ అవసరమైన విత్తనాలను అక్కడే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేజ్ కల్చర్‌లో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల కేంద్రాల్లో ఉచితంగా స్థలాన్ని ఇస్తే మత్స్యశాఖ ఔట్‌లెట్లను నిర్మిస్తామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు అవసరమైన చర్యలను ప్రభుత్వమే చేపడుతుందని వెల్లడించారు. ఫిష్ సీడ్‌ను జిల్లాలోనే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశువైద్య సేవలను అందించేందుకు మోబైల్ క్లినిక్‌లను పంపిస్తున్నామని, మారుమూల గ్రామాల ప్రజలకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు. సునందిని, స్ర్తి,నిధి కార్యక్రమాల ద్వారా పాడి ఆదాయం సమకూరేలా చూడాలన్నారు.