జాతీయ వార్తలు

ఉదయ్‌లో తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రామగుండంలో ఏర్పాటు చేస్తున్న 4వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్కేంద్రాన్ని 2021నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఇంధన మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. శుక్రవారం సిఎం కెసిఆర్‌తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సంస్కరణలు అమలుకు కేంద్రం చేపట్టిన ‘ఉదయ్’లో చేరేందుకు కెసిఆర్ అంగీకరించటం పట్ల గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. ఉదయ్ అమలుతో లక్షల కోట్ల విద్యుత్ ఆదాతోపాటు వినియోగదారులకు మేలు కలుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు త్వరలోనే సమావేశమై ఉదయ్‌ని ఖరారు చేస్తారన్నారు. ప్రధాని సూచించినట్టు కేంద్రం, రాష్ట్రాలు టీం ఇండియాగా పని చేస్తే మేలు కలుగుతుందని, కేంద్రంతో కలిసి పని చేసేందుకు కెసిఆర్ ముందుకొచ్చినందుకు సంతోషమని గోయల్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, విభజన చట్టం హామీమేరకు చేపట్టిన రామగుండం ధర్మల్ ప్రాజెక్టుకు సంబంధించి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రెండు యూనిట్ల టెండరింగ్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. రెండు యూనిట్ల నిర్మాణం 2020కి పూర్తవుతుందన్నారు. మిగతా 3 యూనిట్ల టెండరింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. మూడు యూనిట్ల నిర్మాణాన్ని 2021కి పూర్తిచేసి తెలంగాణ ప్రజలకు 4వేల మెగావాట్ల విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. రామగుండం విద్యుత్కేంద్రం నుంచి వచ్చే బూడిద నిర్వహణకు 600 ఎకరాల భూమి వీలైనంత త్వరగా కేటాయిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ జెన్కో చేపడుతున్న 1080 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన 4 యూనిట్లను బిహెచ్‌ఇఎల్‌కు ఇప్పించేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. బిహెచ్‌ఇఎల్ వద్ద 4 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయంటూ, ప్రాజెక్టును మణుగూరు వద్ద ఏర్పాటు చేస్తున్నారన్నారు. 260 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే 4 యూనిట్లు బిహెచ్‌ఇఎల్ వద్ద సిద్ధంగా ఉన్నాయని గోయల్ వెల్లడించారు. ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తవుతుందన్నారు. ప్రాజెక్టుకు కేంద్రం ఆమోద ముద్ర వేయగానే పర్యావరణ అనుమతి కోసం పంపుతామని గోయల్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పునరుత్పత్తి పథకం కింద 2500 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి ప్రతిపాదించిదంటూ, సిఎం కెసిఆర్ కోరితే మరికొన్ని సౌర విద్యుదుత్పత్తి పథకాలను కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంజరు భూములు చూపిస్తే తెలంగాణకు సౌర పార్కులు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 5,880 మెగావాట్ల కొత్త ధర్మల్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించటం తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. కొత్త ధర్మల్ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం కోల్ లింకేజీ అడిగిందంటూ, కేంద్రం కోల్ లింకేజీ కొత్త విధానాన్ని ఖరారు చేయగానే కెసిఆర్ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తాడిచెర్ల-1 బొగ్గు బ్లాకును తెలంగాణ జెన్కోకు కేటాయించటం తెలిసిందేనంటూ, ఆ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తికి కొంత సమయం పడుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు గ్రిడ్ టాంపరింగ్ లింకేజీ 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఇచ్చేందుకు అంగీకరించామని మంత్రి ప్రకటించారు.