రంగారెడ్డి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, ఫిబ్రవరి 14: దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలో జిల్లా శాఖ ప్రథమ కార్యనిర్వాహకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, భాషా పండితుల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూల్స్‌ను వెంటనే రూపొందించాలన్నారు. విద్యాశాఖలో ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సిసి కెమెరాలు వినియోగించడం తగదన్నారు. ఎస్సెమ్మెస్‌లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆత్వస్థైర్యాన్ని దెబ్బ తీయడమేనన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే కాకుండా ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించేందుకు పనిచేయాలన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు బడుగు, బలహీనవర్గాల పిల్లలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. రాష్ట్రంలో బలమైన ఉపాధ్యాయ సంఘంగా ఉన్న పిఆర్‌టియు సంఘం బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలన్నారు. పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం ఓ వైపు విద్యాహక్కు చట్టాన్ని అమలు పరుస్తుందని చెబుతూనే అందులోని వౌళిక అంశాలను విస్మరించడం తగదన్నారు. ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డుల జారీ విషయమై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు చెన్నకేశవరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, జడ్‌పిటిసి ముత్తహర్ షరీప్, రాష్ట్ర నాయకులు వెంకట్‌రాములు, గోపాల్, నారాయణ్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, నరహరి, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.