ఆంధ్రప్రదేశ్‌

ఉపాధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని యువశక్తిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చక్కగా చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికే కాకుండా అరకొర చదువులతో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులను గుర్తించిన ప్రభుత్వం వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. యువతలో ఉద్యోగం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ఉద్యోగం సంపాదించడం సులువైన మార్గమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం వారికి శిక్షణ ఇవ్వడానికి ఒక్కొక్కరిపై కనిష్టంగా రూ.39 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు ఖర్చు చేయడానికి సిద్ధపడింది. అంతేగాకుండా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మూడు నెలలకు తగ్గకుండా ఆరు నెలలకు మించకుండా రూ.వెయ్యి ప్రోత్సాహక నగదుగా అందజేయాలని నిర్ణయించినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. విద్యార్హత, వారి ఇష్టాయిష్టాల మేరకు మూడు నుంచి తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. శక్తి ఉండీ ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఎంపిక చేసి దేశంలోని ప్రముఖ కంపెనీల ఆధ్వర్యంలోని శిక్షణ సంస్థల్లో శిక్షణ ఇప్పించి అదే కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలోని 1600 పేరెన్నికగన్న కంపెనీలు స్వయం శిక్షణ ఇస్తున్నాయని అధికారులు గుర్తించారు.