అక్షర

ఉత్తమ చారిత్రక నవలిక ‘వీరనారి రుద్రమ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరనారి రుద్రమ
రచన ఆచార్య కసిరెడ్డి,
పుటలు: 66;
ప్రతులకు: 4-5-212,
విజయశ్రీ భవనం, కోఠి,
భాగ్యనగర్- 500 095

తమిళ సీమను ఎందరో రాజవంశీయులు పాలించారు. అయినా వారందరిలోనూ చోళ రాజులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దక్షిణ భారత చరిత్ర పుటల్ని తిరగేసినపుడు ఈ సత్యం స్పష్టమవుతుంది. శత్రువులతో యుద్ధ విజయాలు, అంతర్గత భద్రతలో దక్షత కళాపోషణ, పునాది స్థాయి వరకు పాలనారంగంలో విస్తరించడం ఇట్లా ఎన్నో గొప్ప అంశాలు చోళుల ప్రత్యేకతకు కారణాలయ్యాయి. అట్లాగే తెలుగు ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల్లో కాకతీయులది ప్రముఖ స్థానం. రెండు వందల సంవత్సరాలకు పైగా కొనసాగిన కాకతీయుల పరిపాలన తెలుగువారి గొప్పతనాన్ని యావద్భారతదేశానికి పరిచయం చేసింది. చోళుల వలెనే కాకతీయులు కూడా యుద్ధవీరులు, పాలనా నిపుణులు, కాకతీయ త్రిమూర్తుల (గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు)ను గురించి తలచుకున్న ప్రతి సందర్భంలోనూ తెలుగువారు తమ గతానికి గర్విస్తారు. ఈ త్రిమూర్తులలో వీరనారి రుద్రమను గురించి ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఒక చారిత్రక నవలికను రచించారు. 1993లో తొలుత ముద్రణ అయిన ఈ నవలిక ఇటీవలే తాజాగా మరోమారు ప్రచురణ పొందింది.
కాకతీయుల చరిత్రను గురించి ఎన్నో ప్రామాణిక పరిశోధనలు జరిగాయి. పి.వి.పరబ్రహ్మశాస్ర్తీ, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం వంటి చరిత్రకారులు ఎన్నో విశేషాలు వెలుగులోనికి తెచ్చారు. ఈ చారిత్రక అంశాల్లోకి కొన్ని ఆకట్టుకునే విశేషాలకు కథనరూపాన్ని కల్పించి చెబితే అది యువతరం చదివే అవకాశం ఏర్పడుతుంది. ఆనాటి వీరత్వ విశేషాలు స్థూలస్థాయిలోనైనా యువతరానికి అవగతమవుతాయి. అందుకోసం వీరనారి రుద్రమ వంటి రచనల అవసరం ఉంది.
ఈ ప్రయత్నంచేశారు రచయిత.
ఆచార్య కసిరెడ్డిగారు ధార్మిక సాంస్కృతిక విలువలకోసం దశాబ్దాలుగా కృషిచేస్తున్న సాహితీవేత్త, సాహిత్యం ఆదర్శ సమాజ నిర్మాణంకోసం చక్కని సాధనం కావాలని కోరుకునే రచయిత ఆయన. వీరనారి రుద్రమ నవలికకు రాసిన విజ్ఞప్తిలో ఆయన ఇట్లా పేర్కొన్నారు.
‘‘దేశ ధర్మ జాతి సంస్కృతుల నిమిత్తం సాహస పరాక్రమాలు ప్రదర్శించిన త్యాగమూర్తుల వీరనారుల చరిత్ర అందరికీ తెలియవలసి ఉంది. జాతిలో శౌర్యధైర్యాల నిర్మాణం జరగవలసి ఉంది. అందుకే దేశానికి సుపరిపాలననందించిన వారి గురించి తెలుసుకొని నైతిక విలువలను పెంపొందించుకోవాల్సి ఉంది. దేశ రక్షణ నిమిత్తం పోరాడిన వీరులను వీర వనితలను గురించి తెలుసుకొని తామూ రక్షకులుగా మారవలసి ఉంది...
ఈ లక్ష్యంకోసం ‘‘వీరనారి రుద్రమ’’వంటి రచనలు తప్పక తోడ్పడతాయి. స్వయంభూ దేవాలయంలోని రుద్రమదేవి శిల్పచిత్రాకృతి ముఖచిత్రం ఎంతో విలక్షణంగా ఉంది.

-మూర్తి