జాతీయ వార్తలు

ఉగ్రవాదమే ప్రధాన అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదం, వాతావరణ మార్పు, స్మార్ట్ సిటీ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచిర్ శుక్రవారం ఇక్కడ ఈ విషయం చెప్పారు. భారత పర్యటనకు వస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గురువారం వచ్చిన బెదిరింపు లేఖను ఆయన తేలిగ్గా తీసుకున్నారు. అది నిజంగా ఉగ్రవాదుల నుంచి వచ్చిన లేఖ కాదని, ఎవరో మీడియా దృష్టిని ఆకర్షించడానికి చేసిన పనిగా ఆయన కొట్టిపారేశారు. అయితే ఆ బెదిరింపు లేఖ వచ్చిన విషయం బయటకు పొక్కడం విచారకరమని ఆయన అన్నారు. ఇక్కడికి వస్తున్న ఫ్రాన్స్ బృందంపై ఎలాంటి దాడులు జరుగకుండా చూడడానికి ఢిల్లీలోని భద్రతా దళాలు ఫ్రాన్స్ అధికారులతో సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని ఆయన ప్రశంసించారు. ఫ్రాంకోయిస్ హోలాన్ భారత పర్యటన ఈ ఆదివారం మొదలవుతుంది. ఇరు దేశాల మధ్య జరిగే చర్చలు ముఖ్యంగా మూడు అంశాలపై కేంద్రీకృతం అవుతాయని ఫ్రాన్స్ రాయబారి తెలిపారు. ‘ప్రస్తుతం మనమున్న పరిస్థితులు, సిరియా, ఇరాక్, ఆఫ్రికాలలో అత్యయిక పరిస్థితి విధింపు, సైనిక ఆపరేషన్లతో పాటు భారత్‌లో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా ఉగ్రవాదం అంశం ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది’ అని ఆయన అన్నారు. ఉభయ దేశాల ఉమ్మడి ప్రయోజనాలు, విలువలను కాపాడుకోవాలని భారత్, ఫ్రాన్స్ కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికీ గుర్తు చేయడమే కాకుండా ఉగ్రవాదంపై యుద్ధంలో నిర్దిష్టమైన అనేక చర్యలు తీసుకోవలసిన సందర్భమిదని, అందువల్ల చర్చల అజెండాలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని రిచిర్ తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్‌కు గురువారం వచ్చిన బెదిరింపు లేఖ గురించి విలేఖరులు ప్రస్తావించగా, ఈ లేఖ విషయం బయటకు పొక్కడం విచారకరమని, అయినా తాము పరిశీలిస్తున్నామని బదులిచ్చారు. ఫ్రాన్స్ అధికారులకు ఇలాంటి బెదిరింపు లేఖలు రావడం మామూలేనని వ్యాఖ్యానించారు. ఇది నిజంగా ఉగ్రవాదులు రాసిన లేఖ కాదని, గందరగోళం సృష్టించడానికి, మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఎవరో చేసిన పని ఇదని అన్నారు.