జాతీయ వార్తలు

ఉగ్రవాదుల జాబితాలో మసూద్ పేరునూ చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ఐక్యరాజ్య సమితి కమిటీ 1267కు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. అంతర్జాతీయ ఆంక్షల జాబితాలో మసూద్ అజార్ పేరును కూడా చేర్చాలని తాము గట్టిగా కోరామని పేర్కొన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్, ‘జైషే మహమ్మద్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చి, దాని నాయకుడ్ని వదిలివేయడం ఘోర తప్పిదం’ అని పేర్కొన్నారు. అయితే, తన పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడాన్ని మసూద్ అజాద్ ప్రతిఘటించే అవకాశం ఉంది. అంతేకాదు, తాను ఉగ్రవాదిని కానని, తన మతం కారణంగానే తనపై ఈ ముద్ర వేశారని వాదించేందుకు ఆయనకు అవకాశం ఉంటుంది. కాగా, ఇప్పటికే అల్‌ఖైదా, తాలిబన్, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదుల జాబితాను ఐరాస కమిటీకి తాము అందించామని, అయితే ఆ జాబితాను ఇప్పుడు వెల్లడించడం సమంజసం కాదని వికాస్ స్వరూప్ పేర్కొన్నారు.