ఉత్తరాయణం

దబాయింపుల నిషేధ చట్టం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల హామీలకు, మేనిఫెస్టోలకు ఆయా రాజకీయ పార్టీలు జవాబుదారీ కావాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడడం సహేతుకం. రాజకీయ పార్టీల నాయకత్వాలు నైతిక వర్తనం కన్నా, ఎన్నికల్లో లాభం వైపు మొగ్గుచూపడం అనివార్యమైపోయింది. భారతంలో ధర్మరాజు అవసరానికి ‘అశ్వత్థామ హతః’ అంటూ గట్టిగా పలికి ‘కుంజరః’ అని గొణిగి తన పని తాను సాధించుకొన్నాడు. అయితే, నేటి ధర్మప్రభువులు ‘అశ్వత్థామ హతః’ అని ఆ మాటమీదే గట్టిగా నిలబడిపోతున్నారు. ఎవరైనా నిలదీస్తే ‘కుంజరః అని గట్టిగా అన్నానోయ్, నువ్వు వినకపోతే నా తప్పా?’ అంటూ తిరిగి దబాయించేస్తున్నారు. వెరశి హామీలకు ఎలాంటి విశ్వసనీయతా లేకుండాపోతోంది. దేశవ్యాప్తంగా అధిక రాజకీయ పక్షాలది ఇదే వరస. ముఖ్యంగా ప్రణాళికలు ప్రణాళికల్లా ఉండాలి గానీ పాచికలుగా మారరాదు. ఒకరు చందమామని నేలకి దింపుతానంటే, పోటీగా మరొకరు సూర్యుణ్ణి దింపుతానంటున్నారు. తద్వారా ఆ రకమైన (బరి)తెగింపు చూపని పార్టీలు నష్టపోతున్నాయి. ఆశ పెంచుకున్న ప్రజలు మోసపోతున్నారు. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలకు ప్రాసంగికత తీసుకురావాలి. హామీ ఇచ్చేముందు, అది నెరవేర్చడానికి గల సాధ్యాసాధ్యాలు, తలెత్తే విపరిణామాల గురించి స్పష్టంగా చెప్పాలి. వ్యక్తులు, పార్టీలకు నిబద్ధత, స్వీయ నియంత్రణ లోపించినప్పుడు, వ్యవస్థే పెడ ధోరణుల్ని కట్టడి చేసే మార్గాల్ని పరిపుష్టం చెయ్యాలి. స్వలాభం కోసం ఉద్దేశ పూర్వకంగా వంచించండం నేరమైనప్పుడు, మూ కుమ్మడిగా ప్రజల్ని వంచించండం ఇంకెంత పెద్ద నేరం కావాలి?
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఇళయరాజా వైఖరి సరికాదు
ఇతర దేశంలో జరిగిన ఓ సభలో ప్రఖ్యాత గాయకుడు ఎసిపి బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా సంగీతం సమకూర్చిన పాటలు పాడగా, తన అనుమతిని బాలు తీసుకోలేదని ఆయనకు లీగల్ నోటీసులు పంపారట. ఒక పాట తయారవ్వాలంటే రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు కావాలి. వీరికి నిర్మాత పారితోషికం ఇస్తాడు. పాటలపై సర్వహక్కులూ నిర్మాతవే. అటువంటప్పుడు ఇళయరాజా చేసిన పని ఎంతవరకు న్యాయ సమ్మతం? బాలసుహ్మ్రణ్యం పాడడం తప్పుకాదు. ఇళయారాజా లీగల్ నోటీసు ఇవ్వడం ధర్మసమ్మతం కాదు.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
లంచగొండికి యావజ్జీవ శిక్ష సబబే
ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే రోగులకు మంచి వైద్యం, కనీస గౌరవం లభించని దుస్థితి నేడు కొనసాగుతోంది. రోగినుండి లంచం తీసుకోనిదే ఎలాంటి వైద్యసేవలు అందవు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ జరిగేది ఇదే! ఆసుపత్రులలోనే గాదు, ప్రతి ప్రభుత్వ ఆఫీసులోను పనికోసం వెళ్ళే వారి నుంచి అక్కడి ఉద్యోగులు లంచాలను డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఏ రాజకీయ నాయకుడూ ప్రశ్నించడు. ఎందుకు? కాంట్రాక్టు పనులు చేసుకునే ప్రతి వ్యక్తినుండి మామూళ్లు వసూలు చేయటం సర్వసాధారణమైంది. ఇదంతా తెలిసి కూడా తెలియనట్లు నడచుకోవడం మంత్రుల పనైంది. నీతి, నియమాలనేది మాటలకే పరిమితమైంది. లంచగొండులకు యావజ్జీవ జైలు శిక్షలు పడాలి. లంచాలు ఇచ్చేది లేదని ప్రజలు కూడా ప్రతిఘటించాలి. భయం లేకపోతే పరిస్థితి దారికి రాదని ప్రభుత్వం, ప్రజలు గుర్తించాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురం