ఉత్తరాయణం

వీరికీ అదే గతి తప్పదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది, జరుగుతున్నదీ అన్యాయమే. గతంలో నేషనల్ ఫ్రంట్ , యునైటెడ్ ఫ్రంట్ , యూపిఎ నేడు ఎన్‌డిఏ అయినా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ప్రతి చిన్న విషయానికీ కేంద్రంతో పోరాటం చెయ్యాల్సి వస్తున్నది. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ కాని, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన బిజెపి నేతలు కాని ఈ రాష్ట్రాన్ని అనాథలా తయారుచేశారు. హోదా అన్నారు- అదీ లేదు, ప్యాకేజీ అన్నారు- అది కూడా దక్కలేదు. అందరూ కలిసి ఏపిని నిలువునా ముంచారు. ప్రజల ఆగ్రహానికి గురైనందునే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ కేంద్రంలో సైతం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తే టిడిపి, బిజెపి కూటమికి అదే గతి పడుతుంది!
-మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రపురం

రిజర్వేషన్ల మతలబు ఏమిటి?
తెలంగాణ సిఎం కేసిఆర్ ముస్లింలకు ప్రతిపాదించిన రిజర్వేషన్ల పెంపు అంశం ఆచరణ సాధ్యం కాదని ఆయనకూ తెలుసు. ఆ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకపోతే ఆ నేరం భాజపా మీదకూ, కోర్టు కొట్టేస్తే న్యాయవ్యవస్థపై నెపాన్ని నెట్టివేసి- తాను చేతులు దులుపుకొని పరిశుద్ధునిగా బయటపడవచ్చన్నది ఆయన వ్యూహం. ఇది ముస్లిం రిజర్వేషన్ కాదు- వారి వెనుకబాటుతనానికి తాను ఇస్తున్న రిజర్వేషన్ అని ఆయన చెప్పినా- అగ్రకులాల్లోని పేదల సంగతేమిటి? ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు పెంచడాన్ని ఏమంటారు? పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకోవడం కేవలం భ్రమ. ప్రజలు చూస్తున్నారు..!
-సత్య, కరప
నిజాయితీ ముఖ్యం
ఉత్తరాదికి చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి ఎకె సింఘాల్‌ను టిటిడి ఈవోగా నియమించడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ విమర్శించగా, ఐఏఎస్ అధికారుల సంఘం తగిన సమాధానం చెప్పింది. ఆ తర్వాత జనసేన నేతలు స్వరం మార్చి- ‘అబ్బే! ఉత్తరాదివారిని నియమించకూడదని అనలేదు. మధుర, వారణాసి లాంటి చోట్ల దక్షిణాదివారిని నియమించమని కోరాం’ అంటూ సర్దుకున్నారు. పవన్ వ్యాఖ్య ఎంత అసమంజసమో ఈ సర్దుబాటూ కూడా అంతే. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం మీద ఆధారపడుతుంది. టిటిడి బోర్డు సభ్యుడిగా ఉంటూనే తమిళనాడుకు చెందిన శేఖర్‌రెడ్డి అక్రమ వ్యాపారాల్లో కోట్లు గడించాడు కదా! పని సామర్ధ్యం, నిజాయితీ ముఖ్యం గాని- ఫలానా అధికారి ఏ ప్రాంతం వాడన్నది అనవసర విషయం. ఉన్నతాధికారులకు సంబంధించి ఇలా ప్రాంతీయ వాదంతో ఆలోచించడం సమంజసం కాదు.
-లక్ష్మి, కాకినాడ