ఉత్తరాయణం

ఆరాటం ఎక్కువ.. పోరాటం తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజన హామీల అమలుకై ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో పోరాటం కన్నా ఆరాటం ఎక్కువగా కనపడుతోంది. అది కూడా అందరికీ ఉపయోగపడే అసలు లక్ష్యం కన్నా, రాజకీయ పార్టీలకు ఉపయోగపడే వ్యూహం గురించిన చింతనే ప్రాధాన్యత పొందడం బాధాకరం. రాజకీయాల్లో ఉంటూ, రాజకీయ లబ్ధి గురిచి ఆలోచించకూడదని ఎవరూ అనరు. తమ స్వంత ఉనికి, ఎదుగుదలకు సంబంధించిన ప్రాముఖ్యతాంశంలో రాజీపడడం ఆత్మహత్యా సదృశమే. అయితే ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ లబ్ధిని మించి ఆలోచించాల్సిన అవసరాలు అప్పుడప్పుడూ ఏర్పడతాయి. ఆ సంధికాలంలో ఎలా నడుచుకున్నారు? ఎలా దిశా నిర్దేశం చెయ్యగలిగారు? అన్న గీటురాయిపైనే నాయకుడి లేదా పార్టీ విశ్వసనీయత నిర్ధారింపబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పార్టీలు, వాటి నేతలు ఈ విషయమై మరింత పరిపక్వతతో తమ వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రయోజనాలకు, రాష్ట్ర ప్రయోజనాలకు మధ్య యోజనాల అంతరం ఉన్నపుడు అంతిమ నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆ నష్టం దీర్ఘకాలికం అని నేతలు గ్రహించాలి. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో జరిగిన తప్పులే మళ్లీ విభజన చట్టం అమలులో పునరావృతమైతే అంతకన్నా దారుణం మరొకటి వుండదు. ఇపుడు ముఖ్య బాధ్యత అధికార, విపక్షాలు వహించాలి. మిత్రులైన అధికార పక్షాలు ‘నాలుగేళ్ళూ కోలాటం-ఆఖరులో పోరాటం’ అన్న తరహాలో మాట్లాడుతున్నాయి. భాజపా తాను రాష్ట్రానికి చేసిన మేలు వివరాలు ప్రజలకు స్పష్టం చెయ్యాలి. తెదేపా తన వైఖరి, పోరాట వ్యూహంపై స్పష్టతనివ్వాలి. అఖిలపక్షాల్ని కలుపుకోవాలి. పక్క రాష్ట్రాల్లో జల్లికట్టు లాంటి చిన్న చిన్న కారణాలకు కూడా అన్ని పక్షాలు కలిసి పోరాటం చెయ్యగలిగినపుడు, ఆంధ్రుల హక్కుల సాధన లాంటి చావుబతుకుల సమస్యలపై కూడా అందరూ ఏకాభిప్రాయానికి రాలేకపోవడం ప్రజల పట్ల ద్రోహమే అవుతుంది.

మాతృభాషకు ఆదరణ కరవు

రానురానూ మన మాతృభాష పాఠశాలల్లో కనుమరుగవుతోంది. చాలామంది తల్లిదండ్రులలో ఆంగ్ల భాషపై మోజు పెరగడమే ఇందుకు కారణం. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం మాతృభాషలో కొనసాగినపుడే విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. మాతృభాషలో ప్రావీణ్యం లేక పిల్లలు తెలుగులో నాలుగు మాటలు మాట్లాడలేని దుస్థితి ఏర్పడింది. పూర్వకాలంలో అన్నీ తెలుగు మీడియం బడులే. ఈ బడులలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. మాతృభాష కాని ఆంగ్ల మాథ్యమంలో విద్యాబోధన వల్ల విషయగ్రహణం ఆలస్యమవుతోంది. గ్రామీణులైన తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా తమ పిల్లలను గొప్ప కోసమో, ఇతర కారణాల వల్లనో బలవంతంగా ఆంగ్ల మాథ్యమం చదివిస్తున్నారు. ఆ పిల్లలకు ఏదైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని తీర్చే పరిజ్ఞానం తల్లిదండ్రులకు లేక ఆ వారు నరకయాతన పడుతున్నారు. చాలామంది పిల్లల భవిష్యత్ ఆంగ్ల మాథ్యమ విద్యవల్ల తారుమారవుతోంది. కొందరే ముందడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల కలిగే లాభాలను ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. మాతృభాషకు పూర్వవైభవాన్ని తేవాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం