ఉత్తరాయణం

డార్విన్ సిద్ధాంతంపై చర్చ అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పూర్వ సిద్ధాంతాలు భూమి బల్లపరుపుగా ఉందన్నాయి. ఆ తర్వాత భూమి గుండ్రంగా ఉందని నిర్థారించారు. మన పురాణాల్లో ఎక్కడా కోతి మనిషిగా మారాడని చెప్పలేదు. సిద్ధాంతాలు ఏవో ఆధారాలను బట్టి ఏర్పడతాయి. కాలక్రమేణా అవి తప్పని మరికొన్ని ఆధారాలను బట్టి చెప్పవచ్చు. రామాయణంలోని హనుమంతుడు వానర సంతతికి చెందిన వాడు. శాస్తవ్రేత్త డార్విన్ సిద్ధాంతం ప్రకారం మానవులు వానర సంతతైతే పురాణ పురుషులు మొదలైనవారు కోతి పోలికలతో లేరేమి? కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి సత్యపాల్ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని పరిశోధన, పరిశీలన చెయ్యాలి. డార్విన్ సిద్ధాంతం పొరపాటు కాకూడదా?
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
బడి వద్ద మద్యం దుకాణాలా?
చాలా ప్రాంతాల్లో నేటికీ పాఠశాలల సమీపంలోనే మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల కొందరు విద్యార్థులు మద్యం వైపు ఆకర్షితులవుతున్నట్లు వార్తలు వింటున్నాం. ఇలాంటి వారి అతిప్రవర్తనకు కళ్లెం వేయబోతే తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఉపాధ్యాయులతో ఘర్షణకు దిగుతున్నారు. విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను ఎత్తివేయాలి. పిల్లల దుర్వ్యసనాలకు తల్లిదండ్రులను ప్రథమ బాధ్యులను చేయాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం