నల్గొండ

యువతకు సామాజిక స్పృహ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువతకు సామాజిక స్పృహ ఉండాలి
య ఎంపి బూర నర్సయ్యగౌడ్
భువనగిరి, జనవరి 23: యువత సామాజిక స్పృహ కలిగి ఉండి సమాజాన్ని చైతన్యపరిచే దిశగా కొనసాగాలని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం యువతులపై జరుగుతున్న అత్యాచారాలకు, వేధింపులకు, ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా యువటీం ఆధ్వర్యంలో 5కెరన్ నిర్వహించారు. యువటీం నిర్వహించిన 5కెరన్‌ను భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కుంభం అనీల్‌కుమార్‌రెడ్డిలు జండా ఊపి ప్రారంభించారు. 5కెరన్ ముగింపు సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపి నర్సయ్యగౌడ్ ప్రసంగించారు. యువత ఇతరులపై ఆధారపడకుండా తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. యువతులపై అత్యాచారాలు, ర్యాగింగ్ రుగ్మతలకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. 5కెరన్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విజేతలు మల్లేశం యాదవ్, అనీల్‌కుమార్, రాములునాయక్‌లకు నగదు ప్రోత్సాహకాలను అందజేసారు. 5కెరన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి నర్సయ్యగౌడ్‌లను పూలమాల శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోత్నాక్ ప్రమోద్‌కుమార్, కౌన్సిలర్ చందామహేందర్‌గుప్త, తాడూరి బిక్షపతి, టిఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ జడల అమరేందర్, కొల్పుల అమరేందర్, యువటీం కన్వీనర్ సుదగాని రాజుగౌడ్, సభ్యులు పాదరాజు నరేష్, రత్నపురం బలరాం, పచ్చిమట్ల మధు, బండారు రఘు, తంగెల్లపల్లి మోహన్, కరిపె సురేష్, రంగ రంజిత్, ఎదుగని మంజునాథ్, సాదు మనోజ్, రత్నపురం శ్రీశైలం, ఉపేందర్, సంతోష్, వినీత్, రిత్విక్, సన్నీ పాల్గొన్నారు.
ముగిసిన జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలు
నేరేడుచర్ల, జనవరి 23: లౌకికతత్వానికి నిదర్శనమైన నేరేడుచర్ల మండలంలోని జాన్‌పహాడ్ దర్గా వద్ద మూడురోజుల పాటు జరిగిన ఉర్సు ఉత్సవాలు సంప్రదాయసిద్ధంగా, వైభవంగా ముగిశాయి. ఉర్సు ముగింపు చివరి రోజైన శనివారం నాడు భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు. దర్గా వద్ద ఉన్న నాగేంద్రుడికి పాలు, గుడ్లు, పూలమాలలతో పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. దర్గాలోని సమాధుల చుట్టు తిరిగి తమ కోర్కెలను తీర్చమని సైదులుబాబాను మొక్కుకున్నారు. దర్గా వెలుపల ఉన్న సమాధులను దర్శించుకొన్నారు. సిఫాయి సమాధి వద్ద ప్రదక్షణలు చేశారు. అనంతరం గొల్లబామ గుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేశారు. దర్గా సమీపంలోని సిఫాయి బావిలో నీరు లేకపోవడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. దర్గాలో పలువురు భక్తులు పానసరం పట్టారు. దర్గా వద్ద ఉర్సు ఉత్సవానికి వక్ఫ్‌బోర్డు వసతులు కల్పించడంలో విఫలమయిందని, తాగునీటిని అన్ని అవసరాలకు భక్తులు ఉపయోగించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు చెట్ల కింద, తాము వచ్చిన వాహనాల కిందనే వంటలు వండి ఆరుబయట దుమ్ముధూళిలోనే చిన్నపిల్లలు, వృద్ధులు సేదతీరడం కనిపించింది. ఉర్సు ముగియడంతో భక్తులు తిరుగు ప్రయాణమైనారు. భక్తుల కోసం వ్యాపారులు ఏర్పాటుచేసిన వివిధ దుకాణాలు, మ్యూజికల్ చైర్, రంగులరాట్నం, సర్కస్ తదితర వినోదాలను ఎత్తివేశారు. భక్తుల సౌకర్యాల కోసం రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ట్రాన్స్‌కో, వైద్యారోగ్య, వక్ఫ్‌బోర్డు, ఎక్సైజ్ తదితర శాఖల ప్రత్యేక శిబిరాలను తొలగించారు. ఉర్సు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్‌పి గోనెసందీప్, సిఐ సత్తయ్య, ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు గట్టి బందోబస్తు నిర్వహించారు. దర్గా పూజారి సయ్యద్ మొహినొద్దిన్, వక్ఫ్‌బోర్డు ఇన్స్‌పెక్టర్ ఫయిజొద్దిన్, సర్పంచ్ షేక్ ఖాజాఫాతిమా, ఎంపిటిసి గనె్న సైదా, దర్గా కాంట్రాక్టర్ సుబ్బారావులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
య ఓఎస్‌డి వెంకటేశ్వర్లు
చిట్యాల, జనవరి 23: రహదారిపై వాహనాల్లో కార్లలో ప్రయాణించే సమయాల్లో అతివేగంగా నడపవద్దని అతివేగం అనర్ధమని ప్రయాణాల్లో భద్రతే అతి ముఖ్యమని జిల్లా ఓస్‌డి వెంకటేశ్వర్లు అన్నారు. 27వ జాతీయ రోడ్డు భద్రతావారోత్సవాల సందర్భంగా మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో శనివారం జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్-చిట్యాల పోలీస్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా ఓఎస్‌డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. చిట్యాల ఎస్‌ఐ ఎ. శివకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామసర్పంచ్ రాచకొండ లావణ్యకిష్టయ్య, ఎంపిటిసి బండ గిరిజఅంజయ్య, ఉపసర్పంచ్ నార్సింగ్ వెంకటేశం, చౌటుప్పల్ రూరల్ సిఐ శివరాంరెడ్డిలతో కలిసి ఓఎస్‌డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాహనాలపై ప్రయాణించే సమయాల్లో అత్యవసరం ఉన్నదంటూ వేగంగా వెళుతుంటారని అతివేగం వలన ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రమాదాలు జరిగే అవగాశాలున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు రోడ్డుపై సూచికలు ప్రకాశవంతమైన రేడియం సిక్కర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ప్రయాణీకులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుగునే విధంగా పకడ్బందీ చర్యలను తీసుకుంటున్నామని తమ సిబ్బంది పెట్రోలింగ్‌ను నిర్వహిస్తుందని వాహనదారుల ప్రయాణీకుల భద్రతే తమ లక్ష్యమన్నారు. రోడ్డు భద్రతాచర్యలకు ప్రతిఒక్కరు సహకరించాలని భద్రత అందరి బాధ్యత అని ఆయన అన్నారు. తమ గ్రామంలో మురుగుకాలువకు సంబంధించిన నిర్మాణాన్ని జిఎంఆర్ సంస్థ రహదారి నిర్మాణంలో తొలగించి, మూడేళ్ళయినా నిర్మాణం చేయకపోవడంతో మురుగునీటి సమస్య తీవ్రమైనదని జిఎంఆర్ నిర్లక్ష్యంతో తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. అనంతరం భద్రతకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షుడు అంతటి శ్రీనివాస్‌గౌడ్, జిఎంఆర్ సిజిఎం చంద్రశేఖర్, ప్రతినిధి కృష్ణారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బైపాస్ రోడ్డు సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 23: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ్మస్వామి వారిని దర్శించుకునేందకు అను నిత్యం వేల సంఖ్యలో భుక్తులు వస్తున్నారని వారి అవసరాలకు అనుగునంగా యాదాద్రిని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యాదాద్రి రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా తీర్చిదిద్దుతున్నామని, ఈ నాలుగు లైన్ల రోడ్డు మరమ్మతులు సాగుతున్న తరుణంలో యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డులో చాలా మంది నిర్వాసితులు అవుతున్నారని, వర్తకులు చాలా మందికి నష్టం కలుగుతుందనే సమాచారంతో బైపాస్ రోడ్డుకు శ్రీకారం చుట్టామని బైపాస్ రోడ్డురైతులతో మాట్లాడుతున్నామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. శనివారం గుండ్లపల్లి గ్రామం వద్ద బైపాస్ సర్వే పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ది శరవేగంగా జరుగుతుందని,రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని బైపాస్ విషయమై రైతులతో చర్చిస్తున్నామని అందరిని సంప్రదిచినాకే బైపాస్ పై నిర్ణయాన్ని ప్రకటిప్తామని అన్నారు. ఈ బైపాస్‌లో బుచ్చిదాస ఆశ్రమం ఉందని ఆశ్రమ పీఠాధిపతితో మాట్లాడి, వారి అంగీకారంతోనే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బైపాస్‌ను నిర్మిస్తామని, రానున్న రోజుల్లో యాదాద్రికి అధిక సంఖ్యలో వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ముందు ముందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్డు గాను అవసరమైతే ఆరులైన్ల రోడ్డుగాను చేయాలని రూట్ మ్యాప్‌ను తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసి సత్యనారాయణ, ఆర్‌డివో మధుసూదన్, తహసిల్దార్ రామకృష్ణ, ఆర్ ఆండ్‌బి అధికారి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
కలెక్టరేట్(నల్లగొండ), జనవరి 23: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలోని అన్ని మండల, డివిజన్ కేంద్రాలలో రాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో కళాశాల విద్యార్ధులచే ఎన్‌జి కళాశాల నుండి గడియారం సెంటర్ వరకు ర్యాలీ ఉంటుందని అనంతరం కార్యక్రమం నిర్వహిస్తునట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు.
ధైర్యసాహసాలకు మారుపేరు ‘నేతాజీ’
చిట్యాల, జనవరి 23: ధైర్యసాహసాలకు, పట్టుదలకు మారుపేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆయన ఆశయాలను యువత సాధించాలని జిల్లా ఓఎస్‌డి వెంకటేశ్వర్లు, గుండ్రాంపల్లి సర్పంచ్ రాచకొండ లావణ్యకిష్టయ్య అన్నారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా శనివారం మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో నేత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో నేతాజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి ఓఎస్‌డి, సర్పంచ్, ఉపసర్పంచ్ నార్సింగ్ వెంకటేశం, ఎంపిటిసి బండ గిరిజఅంజయ్య, చౌటుప్పల్ రూరల్ సిఐ శివరాంరెడ్డి, చిట్యాల ఎస్‌ఐ శివకుమార్, పిఎసిఎస్ అధ్యక్షుడు అంతటి శ్రీనివాస్‌గౌడ్, సంఘం అధ్యక్షుడు కాసు గణేష్‌లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓఎస్‌డి, సర్పంచ్‌లు మాట్లాడుతూ దేశం కోసం నిస్వార్ధంగా పోరాడిన మహనీయుడు నేతాజి అని, అలాంటి మహనీయుని చరిత్ర నేటికి యువకులంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు అంబరి చంద్రశేఖర్, గోపగోని చెల్మయ్య, పిల్లి మహేష్, రాజేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రమాదరహిత జిల్లాగా మార్చాలి
సూర్యాపేట, జనవరి 23: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే ప్రమాదరహిత జిల్లాగా మార్చేందుకు పాటుపడాలని రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ సందీప్‌కుమార్ సుల్తాన్ కోరారు. 27వ రోడ్డ్భుద్రతా వారోత్సవాల సందర్భంగా శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వాహనదారుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హజరై మాట్లాడారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, రహదారులు విస్తరిస్తున్న ఏటేటా ప్రమాదాలు పెరుగుతూ మృతులసంఖ్య పెరిగిపోతుండటం బాధకలిగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతేడాది కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలకు గురై 1300మంది మృత్యువాత పడ్డారన్నారు. లక్ష 50వేల మంది వరకు ప్రమాదాల కారణంగా గాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్‌గన్‌లను ఏర్పాటుచేసి కేసులు నమోదు చేస్తున్నా వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లితుందన్నారు. గతేడాది 65నెంబరు జాతీయరహదారిపై 10వేల వాహనదారులపై ఓవర్‌స్పీడ్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం హైవే 65సెమి ఎక్సిస్ కంట్రోల్‌రోడ్డుగా పరిగణిస్తు వాహనాల వేగాన్ని 80కిలోమీటర్‌లకు పరిమితం చేశామని, ఆ వేగాన్ని దాటితే జరిమానాలు విధిస్తున్నామన్నారు. త్వరలోనే ఈరహదారి ఎక్స్‌ప్రెస్ హైవేగా మారనుందని, అప్పుడు వేగానికి నియంత్రణ ఉండదన్నారు. ద్విచక్ర వాహనదారులు కొద్ది దూరం వెళ్లినా, సుదూరం వెళ్లినా తప్పక హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలు జరిగినా ప్రాణనష్టం జరగకుండా ఉంటుందని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపరాదని, అధికవేగంతో వెళ్లవద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా వెళితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. 18ఏళ్లలోపు మైనర్‌లకు వాహనాలు నడిపేందుకు ఇవ్వవద్దని, అలా పిల్లలను తల్లిదండ్రులు ప్రొత్సహించవద్దని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు మాత్రమే వాహనాలు నడపాలని కోరారు. రవాణాశాఖ డిప్యూటీ కమీషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలకు పాటించేలా భారీగా జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రోడ్డుప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో యువకులే అధికంగా ఉంటున్నారని, అందువల్ల యువత ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వాహనాల ధృవీకరణ పత్రాలతో పాటు విధిగా డ్రైవింగ్ లైస్‌న్స్‌లు కలిగి ఉండాలన్నారు. సూర్యాపేట డిఎస్పీ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ యువత ట్రాఫిక్ నిబంధలను పాటించడంతో పాటు సమాజంలోని వారిని చైతన్యం చేసేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఎ హన్మంతరెడ్డి, సూర్యాపేట ఎంవిఐ కోండయ్యతో పాటు జిల్లాలోని పలువురు ఎంవిఐలు, సూర్యాపేట పట్టణ, గ్రామీణ ఇన్స్‌స్పెక్టర్లు వై.మొగిలయ్య, వి.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్‌ల వాడకంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన బైక్ ర్యాలీని కమిషనర్ సందీప్‌కుమార్ ప్రారంభించారు.

యాదాద్రి అభివృద్ధి పనులు వేగవంతం
డ, జనవరి 23: యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు ఇక వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులకు సూచించారు. శనివారం ఆయన యాదాద్రి సందర్శించి శ్రీ లక్ష్మినరసింహస్వామి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం మేరకు అర్చక బృందం ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి, ప్రత్యేక పూజల అనంతర పట్టు శేష వస్త్రాలు అందించి ఆశీర్వచనం పలికారు. అనంతరం రాజీవ్‌శర్మ కొండ పరిసరాలను పరిశీలించి ఆండాళ్ నిలయంలో మాస్టర్ ప్లాన్ మేరకు దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జెసి ఎన్. సత్యనారాయణ, డిఆర్‌వో రవినాయక్, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్‌రావు, కార్యదర్శి రమేష్‌రెడ్డి, అర్కిటెక్ట్ ఆనందసాయి, ఈవో గీతారెడ్డిలు ఈ సమీక్షా సమావేశంలో ప్రధాన ఆలయ విస్తరణ పనులతో పాటు కొండ కింద చేపటనున్న నిర్మాణ పనులను రాజీవ్‌శర్మకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రస్తుత నిర్మాణాలు తొలగించి నూతన నిర్మాణాలు వేగంగా జరిపించాలని సూచించారు. భూసేకరణ, టెండర్ల ప్రక్రియలను త్వరితగతిన ముగించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పిదప గుట్టపైకి నిర్మాణంలో ఉన్న రెండవ ఘాట్ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన రెండు వేల ఎకరాల భూసేకరణ పనులను, రోడ్ల విస్తరణ, బైపాస్ నిర్మాణ పనులను, మినీ ట్యాంకు బండ్ నిర్మాణ పనులను సిఎస్ రాజీవ్ శర్మ స్వయంగా పరిశీలించారు. ఆయా పనుల పురోగతిని కలెక్టర్, జెసిలు ఆయనకు వివరించారు. అంతకుముందు కొండపైన హరితాహారం స్టాల్‌ను ప్రారంభించిన శర్మ భక్తులకు, స్థానికులకు తులసితో పాటు ఔషధ, సుగంధ మొక్కలను పంపిణీ చేశారు. గుట్టను సందర్శించిన రాజీవ్‌శర్మకు కలెక్టర్, జెసి, డిఆర్‌వో, ఆలయ ఈవోలు స్వాగతం పలికారు.
కలెక్టరేట్ ముట్టడి
నల్లగొండ రూరల్, జనవరి 23: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శనివారం ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వేముల రాజు, బరిగెల వెంకటేష్‌లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విద్యార్ధులపై కేసి ఆర్ కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకే ఫీజులు విడుదల చేయడం లేదని, తక్షణమే ఫీజులు విడుదల చేయాలని లేకుంటే ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు తోపులాటలు చోటు చేసుకున్నాయి. అనంతరం విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చేపూరి కొండల్, ఉదయ్, రాము పాల్గొన్నారు.
నేతాజీ సేవలు మరువలేనివి: ఆర్డీవో
నల్లగొండ టౌన్, జనవరి 23: నేతాజీ భారతదేశానికి చేసిన సేవలు మరువ లేనివని, ఆంగ్లేయులను ఎదుర్కొనేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆర్‌డివో వెంకటాచారి అన్నారు. నేతాజీ 119వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఎబివిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆర్‌డివోతోపాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీ్ధర్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విజయ్‌కుమార్, ఏఆర్ డిఎస్‌పి శ్రీనివాస్, న్యాయశాఖ ఉద్యోగి ఉమేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సుభాష్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అని, పదివేల మందితో సైన్యాన్ని తయారు చేశాడన్నారు. యవత దేశభక్తితో, సేవాభావంతో జాతీయ భావాలు అలవరచుకొని నేతాజీ బాటలో నడిచి దేశప్రగతికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అశోక్‌రెడ్డి, జాని, ముసుకు భరత్, సంతోష్‌నాయక్ పాల్గొన్నారు.