రాష్ట్రీయం

ఉపాధి హామీ అమల్లో ఏపి టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇఎస్) అమల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఉపాధి పథకం అమల్లో పారదర్శకత, జవాబుదారీ తనంతో పాటు కూలీలకు సక్రమంగా వేతనాల చెల్లింపు, తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు సంతృప్తి చెందిన కేంద్రం జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసింది. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు వేతనాల చెల్లింపులో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని, ఇదే జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంలో కీలకమైందని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధిహామీ పథకం అమలు శాఖల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం విశాఖలో వెల్లడించారు. వచ్చే నెల 2న ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించే ఇజిఎస్ సమ్మేళన్‌లో అవార్డును అందుకోనున్నట్టు ఆయన తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు తపాలాశాఖతో కలిసి కూలీలకు సకాలంలో వేతనాలు పూర్తి పారదర్శకంగా అందజేయడంలో ప్రభుత్వం ముందుందన్నారు. ఉపాధిహామీ పథకంలో 95 శాతం ఆధార్ ఆధారిత చెల్లింపులు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉపాధిహామీ పథకం అమల్లో క్రమ పద్ధతిలో సామాజిక తనిఖీ, నాణ్యత నియంత్రణ, విజిలెన్స్, మొబైల్ మేనేజ్‌మెంట్ విధానం, ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ విధానం ద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ పనులు నిర్వహించామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,100 కోట్లను ఉపాధిహామీ పనులకు వెచ్చించగా, రూ.2,153 కోట్లమేర చెల్లింపులను ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ విధానం ద్వారానే జరిపినట్టు ఆయన తెలిపారు. పనుల నాణ్యతను పరిశీలించడంతో పాటు సక్రమంగా పనులు జరిగేలా చూసేందుకు జిల్లాల స్థాయిలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయం చేస్తూ మంచి ఫలితాలను సాధించామన్నారు. ఉపాధిహామీ పథకం అమల్లోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్రానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం సంతోసంగా ఉందన్నారు. ఉపాధిహామీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు తరచు సమీక్షిస్తూ మంచి ప్రోత్సాహాన్ని అందించారని అన్నారు. అవార్డు దక్కడంతో తమ శాఖపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.