జాతీయ వార్తలు

సుప్రీంకోర్టుకు ఉడ్తా పంజాబ్‌ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఉడ్తా పంజాబ్‌ సినిమా వివాదంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పంజాబ్‌కు చెందిన ఓ ఎన్జీవో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండు రోజుల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఎన్జీవో పిటిషన్‌ వేయడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. తొలుత 89 సీన్లను నిషేధించాలని సూచించిన సెన్సార్‌ బోర్డు.. చివరకు 13 కట్లతో సినిమాకు ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఒక్క కట్‌తో 48 గంటల్లోగా సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని న్యాయస్థానం సెన్సార్‌బోర్డును బాంబే హైకోర్టు ఆదేశించింది. అయితే, బాంబేహైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సినిమాపై స్టే విధించాలని తాము కోరినట్లు ఎన్జీవో తెలిపింది.