జాతీయ వార్తలు

ఉగ్రదాడులను తిప్పికొడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి ముప్పునయినా ఎదుర్కోవడానికి సిద్ధం భారత నావికాదళ అధిపతి అడ్మిరల్ ధోవన్

కన్నూర్ (కేరళ), నవంబర్ 26: సముద్ర జలాల్లో, తీర ప్రాంతాల్లో ఎలాంటి సవాళ్లనయినా ఎదుర్కొనేందుకు, సముద్ర మార్గం మీదుగా వచ్చే ఎలాంటి ముప్పునయినా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత నావికాదళం గురువారం ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం గుండా ముంబయి నగరానికి చేరుకున్న ఉగ్రవాదులు ఊచకోతకు పాల్పడి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా నావికాదళం చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సముద్ర మార్గం నుంచి వచ్చే దాడులను తిప్పికొట్టేందుకు సముద్ర తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఇతర భద్రతా సంస్థలతో కలిసి అనేక చర్యలు చేపట్టినట్లు నేవీ వివరించింది. సముద్ర జలాలు, తీర ప్రాంతాల్లో భద్రత తదితర అన్ని అంశాలను చూస్తున్న అతి పెద్ద సంస్థగా నేవీ ఎలాంటి సవాళ్లనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని భారత నావికాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.కె.్ధవన్ అన్నారు. ఇక్కడికి సమీపంలోని ఎఝిమాలలో గల ఇండియన్ నావల్ అకాడమిలో గురువారం జరిగిన కేడెట్ల పాసింగ్ ఔట్ పరేడ్‌ను ఆయన పరిశీలించారు. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన 330 మంది, మిత్ర దేశాలకు చెందిన ఆరుగురు కేడెట్లు ఈ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. ధోవన్ ఈ సందర్భంగా 26/11 దాడులను ప్రస్తావిస్తూ, అలాంటి దాడులను తిప్పికొట్టడానికి తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర సంస్థలతో కలిసి నేవీ అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. సముద్ర-తీరప్రాంత భద్రతను బలోపేతం చేయడానికి నేవీ తీసుకున్న పలు చర్యలను ధోవన్ వివరించారు. ఎలాంటి ముప్పునయినా ముందే పసిగట్టి తిప్పికొట్టే తమ కార్యక్రమంలో దేశంలోని 9 తీర ప్రాంత రాష్ట్రాల్లో అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. (చిత్రం) కేరళలోని ఇండియన్ నావల్ అకాడమిలో గురువారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఓ కేడెట్‌కు పతకాన్ని అందిస్తున్న నావికాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.కె.్ధవన్