తెలంగాణ

‘ఉగ్ర అనుమానితుల్లో’ ఆరుగురు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సామాజిక వెబ్‌సైట్లలో బృందంగా ఏర్పడి పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు ఇక్కడి పాతబస్తీలో అరెస్టు చేసిన 11 మందిలో ఆరుగురిని విచారణ అనంతరం విడిచిపెట్టారు. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందన్న సమాచారం మేరకు ఎన్‌ఐఎ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో బుధవారం ఉదయం పాతబస్తీలో విస్తృతంగా తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 11 మంది ఉగ్ర అనుమానితులను అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగించింది. నగరంలోని ఎన్‌ఐఎ కార్యాలయంలో వీరిని క్షుణ్ణంగా విచారించాక, ఆరుగురిని విడుదల చేశారు.