వీక్లీ ఫీచర్లు

హడావుడి తిండితో.. అల్సర్లే గతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నవీన యుగంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఇది. దీనికి కారణం మారిన జీవనశైలి విధానాలే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక కాలంతో పరుగులు, వేళకు తీసుకోని ఆహారం, ఒకవేళ తీసుకున్నా హడావిడిగా క్షణంలో ముగించడం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం, వీటితోపాటు నిత్యం ఎదుర్కొనే రకరకాల మానసిక ఒత్తిళ్ళు తోడుకావడంతో జీర్ణకోశంలో అల్సర్ (గ్యాస్ట్రిక్ అల్సర్) సమస్య తీవ్రరూపం దాలుస్తున్నది.
లక్షణాలు
జీర్ణాశయంలో అల్సర్ ఏర్పడటంవల్ల కడుపులో నొప్పి, మంట రావటం
తేన్పులు ఎక్కువగా ఉండటం
గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం
కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం
తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం
వాంతులు కావడం
జాగ్రత్తలు
ఫాస్ట్ఫుడ్, ఆయిల్ ఫుడ్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాల్ మానివేయాలి.
నిలువ వుంచిన పచ్చళ్ళు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి.
నీరు సరిపడినంత తాగాలి
మానసిక ఒత్తిడిని నివారించడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. టీ, కాఫీలు మానివేయాలి.
పరీక్షలు: ఎండోస్కోపి ద్వారా ఈ వ్యాధిని నిర్థారిస్తారు.
చికిత్స: హోమియో వైద్యంలో గ్యాస్ట్రిక్ అల్సర్‌తో బాధపడేవారికి మంచి చికిత్స ఉంది. శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని ఇవ్వడంవల్ల వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది.
మందులు
నక్స్‌వామికా: మసాలాలు, ఫాస్ట్ఫుడ్, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
అర్జెంటం నైట్రికం: పొట్టలో నొప్పి ఉండి తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది. వీరు మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటారు. ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు.
ఎనాకార్డియం: వీరికి పొట్టలో నొప్పి ఏదైనా తిన్న తరువాత తాత్కాలికంగా తగ్గుతుంది. మళ్లీ నొప్పి రెండు గంటల తరువాత మొదలవడం గమనించదగిన లక్షణం. వీరు మానసిక స్థాయిలో మతిమరుపు ఎక్కువగా ఉండి దుర్భాషలాడే స్వభావంతో ఉంటారు. ఇటువంటివారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఫాస్ఫరస్: పొట్టలో అల్సర్ ఉండి రక్తం కూడా పడుతుంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది. చల్లటి పదార్థాలు ఐస్‌క్రీమ్‌లు తింటే నొప్పి ఉపశమిస్తుంది. వీరు మానసిక స్థాయిలో భయస్థులు. ఉరుములు మెరుపులు అంటే భయపడతారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
ఈ మందులే కాకుండా గ్రాఫైటిస్ ఇపికాక్ బ్రయోనియా ఆర్సెనికం ఆల్బం, సల్ఫర్, కార్బొవెజ్, చైనా, లైకోపోడియం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే మంచి ఫలితం ఉంటుంది.

డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ 9440229646